HBD Trisha Krishnan: 43 ఏళ్లు.. దశాబ్దాల కెరీర్‏లో ఎన్నో వివాదాలు.. త్రిష ఆస్తి ఎన్ని కోట్లంటే?

HBD Trisha Krishnan: సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవ్వడమంటే మామూలు విషయం కాదు. అయితే, ఈ రేర్ ఫీట్‌ను త్రిష (Trisha Krishnan) బ్రేక్ చేసింది. ఆమెతో పోటీపడటానికి ఎంతోమంది కొత్త భామలు వస్తున్నా, త్రిష క్రేజ్ మాత్రం తగ్గలేదు సరికదా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత జోష్ తో దూసుకెళ్తుంది. కేవలం గ్లామర్, నటనతోనే కాదు.. సంపాదనలోనూ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. నేడు త్రిష పుట్టినరోజు.. ఈరోజుతో ఆమె 43వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఆమె కెరీర్, వివాదాలు, ఆస్తులు వివరాలపై ఓ లూక్కేద్దాం.

త్రిష సినీ ప్రయాణం 1999లో ప్రారంభమైంది. జోడీ (Jodi)సినిమాలో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా తన నటనతో మెప్పించింది, ఆ తరువాత వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. ఇక తెలుగు ఇండస్ట్రీలోకి వర్షం (Varsham) సినిమాతో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే భారీ గుర్తింపు పొందింది. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, బుజ్జిగాడు వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారింది.

HBD Trisha Krishnan Net Worth Career Luxury Assets amp amp Viral Controversies

అయితే.. కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అమ్మడు .. పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్రతో సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ప్రస్తుతం కూడా ఆమె చేతిలో పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉండటం విశేషం. చిరంజీవి సరసన "విశ్వంభర", సూర్యతో "కరుప్పు", అలాగే మోహన్ లాల్ తో "రామ్" వంటి సినిమాలు ఆమెకు మరింత స్టార్ డమ్ ను తీసుకవచ్చాయి.

కోట్లల్లో ఆస్తులు..
త్రిష కేవలం నటనలోనే కాదు, సంపాదనలో కూడా టాప్‌లో ఉంది. తాజా అంచనాల ప్రకారం ఆమె నెట్ వర్త్ సుమారు రూ.85 కోట్ల నుంచి రూ.90 కోట్ల మధ్య ఉంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా ఆమెకు భారీ ఆదాయం వస్తోంది. ఏడాదికి సుమారు రూ.9-10 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్‌లో కూడా త్రిష తెలివిగా ఇన్వెస్ట్ చేసింది. చెన్నైలో సుమారు రూ.7-10 కోట్ల విలువైన లగ్జరీ హౌస్, హైదరాబాద్‌లో రూ.6 కోట్ల విలువైన బంగ్లా ఆమె ఆస్తుల్లో ఉన్నాయి.

ఇవే కాకుండా ప్లాట్లు, ఇతర ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. త్రిష లగ్జరీ లైఫ్‌స్టైల్‌లో కార్ల కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆమె వద్ద మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, BMW 5 సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్, మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ వంటి కాస్లీ వాహనాలు ఉన్నాయి. ఈ కార్లు ఆమె స్టైల్, క్లాస్‌ను ప్రతిబింబిస్తాయి.

Jetlee Day 3 Box Office Collection: సత్య మూవీకి దారుణమైన కలెక్షన్స్.. 3 రోజుల్లో ఇంతే.. హిట్ కావాలంటే మాత్రం!
ఇటీవల త్రిష పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్స్. తమిళ స్టార్ దళపతి విజయ్ తో ఆమెకు సంబంధం ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ నేపథ్యంలో విజయ్ భార్య విడాకుల వార్తలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఇద్దరూ కలిసి ఒక పెళ్లి రిసెప్షన్‌లో కనిపించడం ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. కొంతమంది నెటిజన్లు దీన్ని "సాఫ్ట్ లాంచ్" అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై త్రిష గానీ, విజయ్ గానీ అధికారికంగా స్పందించలేదు.

43 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తూ, స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారడం త్రిష ప్రత్యేకత. కెరీర్, సంపద, క్రేజ్ మూడు విభాగాల్లోనూ టాప్‌లో కొనసాగుతున్న ఈ బ్యూటీ, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి... పుట్టినరోజు సందర్భంగా త్రిష మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X