Amala Paul 7వ నెలలోనే అమలాపాల్ గుడ్‌న్యూస్.. 2 హ్యాపీ కిడ్స్ అంటూ చేతిలో బిడ్డతో పోస్ట్!
హీరోయిన్ అమలా పాల్ గుడ్ న్యూస్ చెప్పింది. రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్ కు ప్రస్తుతం 7వ నెల గర్భంతో ఉంది. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ పోస్ట్ చేసింది. చేతిలో బిడ్డతో కనిపించి షాకిచ్చింది. అంతే కాదు.. 2 హ్యాపీ కిడ్స్ అంటూ రాసుకువచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి.
స్టార్ హీరోయిన్ గా...
హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ మొదట ప్రేమ ఖైదీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత సిద్ధార్థ్ తో కలిసి లవ్ ఫెయిల్యూర్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తెలుగు అడియెన్స్ కు కూడా బాగా దగ్గరైంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుసగా తెలుగు, తమిళ సినిమాల ఆఫర్లు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.

న్యూడ్ గా నటించి...
కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్, విజయ్ వంటి హీరోల సరసన నటించింది. ఇక టాలీవుడ్ లోనూ రామ్ చరణ్ పక్కన నాయక్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక వీటితో పాటు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి అమలాపాల్ నటించింది. అమలాపాల్ ఆ మధ్య ఆమె అనే సినిమాలో న్యూడ్ గా నటించి ప్రేక్షకులకు షాకిచ్చింది. ఇక ఈ సినిమా అప్పట్లో వివాదాస్పదం కూడా అయింది. తమిళ, తెలుగు బాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది.
రెండో పెళ్లి...
ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గతంలో తమిళ్ దర్శకుడు ఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడింది అమల పాల్. ఆతర్వాత వీరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఎందుకు విడిపోయారనే రీజన్ మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. ఇక గతఏడాది అమలా పాల్.. రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జగత్ దేశాయ్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత భర్తతో కలిసి దిగన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది.

షాకింగ్ పోస్ట్...
అయితే ఇటీవల ప్రెగ్నెన్సీ అంటూ ప్రకటించింది. అయితే ఈ బ్యూటీ పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అంటూ వార్తలు వచ్చాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. బేబీ బంప్ ఫోటోలతో అమలా రెచ్చిపోతుంది. మొన్నటికి మొన్న భర్తతో కలిసి పబ్ లో బేబీ బంప్ తో డ్యాన్స్ చేసింది. ఇక ఆ వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అమలా పాల్ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. అది చూసి నెటిజన్స్, ఫ్యాన్స్ ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తమన్నా- విజయ్ వర్మ బెడ్ రూమ్ రిలేషన్ బయటపెట్టిన సమంత.. ఫోటో వైరల్
ట్విన్స్ కన్ఫార్మ్...
అమలా పాల్ కు ఎప్పటి నుంచో ట్విన్స్ పుడతారు అంటూ ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే అమలా పాల్ చేతిలో బిడ్డతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దానికి కింద క్యాప్షన్ 2 హ్యాపీ కిడ్స్ అంటూ పోస్ట్ చేసింది. దీంతో అమలా పాల్ కు ట్విన్స్ కన్ఫార్మ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి 7వ నెల. మరి అమలాపాల్ నిజంగానే కవలలకు జన్మనివ్వనుందా..? అన్నది త్వరలో తెలియనుంది. చూడాలి మరి.


Click it and Unblock the Notifications











