Charmy Kaur: ఆ హీరో రెండో పెళ్లయ్యాకే నాది... చార్మి కౌర్ షాకింగ్ కామెంట్స్

ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతానికి నిర్మాతగా మారిపోలు సినిమాలను నిర్మిస్తూ వస్తున్న చార్మి కౌర్... తన వివాహం గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఆమె తన పెళ్లి గురించి ఏం మాట్లాడింది? ఎందుకు ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయనే వివరాల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం పదండి.

తెలుగు సినీ పరిశ్రమలో వయసు పైబడుతున్న ఇంకా వివాహం చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టాలీవుడ్ సెలబ్రిటీల లిస్టులో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్, అనుష్క వంటి వాళ్ల గురించి అయితే ఎప్పటికప్పుడు అనేక రకాల వార్తలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సరసన కూడా నటించి తర్వాత నిర్మాతగా మారిన చార్మికౌర్ వివాహం గురించి కూడా అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి.

Heroine And Producer Charmy Kaur Shocking Comments on Hrithik Roshan and Her Marriage

నిజానికి తన పదహారేళ్ళ వయసులోనే చార్మి హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయమై... తన అందంతో, అభినయంతో ప్రేక్షకులు అందరినీ అలరిస్తూ వచ్చింది. తెలుగులో దాదాపుగా స్టార్ హీరోలు అందరి పక్కన నటించిన ఈ భామ.. అనేక హిట్ సినిమాల్లో కూడా భాగమైంది. అయితే ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం.. అవి కలిసి రాకపోవడంతో నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించింది. ఎక్కువగా పూరి జగన్నాథ్ తోనే ఆమె నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటుంది.

పూరి జగన్నాథ్ దర్శకుడిగా వ్యవహరించే దాదాపు అన్ని సినిమాలకు ఇప్పుడు చార్మి నిర్మాతగా ఉంటోంది. అయితే హీరోయిన్ గా అనేక రకాల సక్సెస్ అందుకున్న ఈ భామ ఎందుకో నిర్మాతగా మాత్రం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయితే వయసు 36 సంవత్సరాలు పైబడుతున్న ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అనే విషయం మీద మాత్రం ఎప్పుడూ స్పందించకుండా దూరంగా ఉంటూ వస్తుంది.

Heroine And Producer Charmy Kaur Shocking Comments on Hrithik Roshan and Her Marriage

ఈ భామ అయితే తాజాగా తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అవి నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అని అడిగితే తనకు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమని.. అప్పట్లో ఆయనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ అప్పటికే ఆయనకు పెళ్లయింది అనే విషయం తెలిసి చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చింది.

అంతేకాక ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం హృతిక్ రోషన్ విడాకులు తీసుకున్న సింగిల్ గా ఉంటున్నారు కదా.. ఆయనకు మరోసారి పెళ్లి జరిగితే అప్పుడు తాను కూడా కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని కామెంట్ చేసింది. వాస్తవానికి హృతిక్ రోషన్ మరో యువతితో ప్రేమలో పడిన సంగతి కూడా దాదాపుగా అందరికీ తెలుసు. ఆయన సభా ఆజాద్ అనే ఒక అమ్మాయితో ప్రేమలో పడటం వారిద్దరూ కలిసి చట్టపట్టాలు వేసుకొని తిరగటం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే వస్తున్నాయి. మరి వారిద్దరి వివాహం జరిగితే చార్మి కూడా వివాహం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X