డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను మోసం చేశా... షాకింగ్ విషయం బయటపెట్టిన హీరోయిన్ అనుష్క
హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకపరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ సూపర్ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టి.. కుర్రాళ్ల మనసును దోచేసింది. ఇక బహుబలి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇటీవల మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క.. పూరీ జగన్నాథ్ ను ఓ విషయంలో మోసం చేసినట్లు చెప్పుకువచ్చింది. అసలు అంతలా ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం.
షాకింగ్ కామెంట్స్...
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క శెట్టి.. యోగ టీచర్ గా 6 సంవత్సరాలు పనిచేశాను అని వెల్లడించింది. మనీ చాలా తక్కువ వచ్చేది.. కేవలం నా ప్యాషన్ కోసమే వర్క్ చేశానని తెలిపింది. నా అవసరాలు ఉంటాయి.. ఏదైనా కొనుక్కోవాలంటే వేరే వాళ్లను అడగటం ఎందుకు అనిపించేది. అందుకే నేను యోగా టీజర్ గా వర్క్ చేశాను.. అండ్ నాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం.. అంటూ తెలిపింది. ఇక తన ఫస్ట్ సినిమా అవకాశం గురించి మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది స్వీటి.

మోసం చేశా...
యోగా టీజర్ గా వర్క్ చేసే సమయంలో నా ఫ్రెండ్ భర్త నివాస్ గారు.. పూరీ జగన్నాథ్ గారిని కలవమని చెప్పారు. ఎందుకు అని అడిగితే.. హీరోయిన్ కోసం ఓ అమ్మాయిని చూస్తున్నారు జస్ట్ కాల్ చేయమని చెప్పారు. అయితే నేను పూరీ జగన్నాథ్ గారి విషయంలో చీటింగ్ చేశాను. ఆయనకు కాల్ చేయలేదు. నివాస్ గారు వచ్చి అడిగితే... ఆ చేశాను అంటూ అబద్ధం చెప్పాను అంటూ విషయం చెప్పుకువచ్చింది. అప్పుడు నాకు భయం, సిగ్గు ఉండేది.. ఆ తర్వాత అందరూ కలిసి పూరీ జగన్నాథ్ ను కలిపించారని తెలిపింది.
యాట్టిట్యూడ్ అనుకుంటారని...
నాకు అప్పుడు టీవీ, మూవీస్ ఎలాంటివి తెలియదు. పూరీజగన్నాథ్ గారిని కలిశాను. మూవీ అని చెప్పారు. ఓ ఫోటో అడిగారు.. నేను పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే ఇచ్చాను. అప్పట్లో నాకు తెలియదు. అయితే ఆ తర్వాత మళ్లీ కలువమన్నారు.. కానీ నాకు క్లాస్ ఉందని చెప్పాను... కానీ వాళ్లు ఏం అనుకున్నారో తెలియదు.. ఆ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి వాళ్లు యాట్టిట్యూడ్ అనుకుంటారు.. మళ్లీ పూరీ జగన్నాథ్ ఫోన్ చేసి.. క్లాస్ అయిపోయాక రమ్మని అన్నారు..
లైఫ్ ఇచ్చిందే వాళ్లే
ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్లాను. మేకప్ టెస్ట్ చేశారు. ఇంకో అమ్మాయి కూడా ఆడిషన్ కు వచ్చింది. ఆ అమ్మాయికి ఫోటోషూట్ చేశారు. అవన్నీ చూసి.. నాకు ఏడుపువచ్చేసింది. నా ఫ్రెండ్ పక్కన వందన అనే అమ్మాయి ఉంది. ఆమెతో నేను వెళ్లిపోతాను అంటూ చెప్పాను. నాగార్జున గారు చూసి ఈ అమ్మాయి సమ్థింగ్ అంటూ సజెస్ట్ చేశారు. ఇప్పుడు రా కానీ పోటేన్షియల్ ఉంది అని చెప్పుకువచ్చారు. ఆయన వల్లే నేను ఈ పోజిషన్లో ఉన్నాను. పూరీ జగన్నాథ్, నాగార్జున, సుప్రీయ వీళ్లంతా నాకు లైఫ్ ఇచ్చారంటూ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











