ఆ హీరోలతో రొమాన్స్ బోర్.. ఆ ఫీలింగ్ తప్ప ఏం ఉండదు.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బాలిక వధు అనే సీరియల్ తో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది అవికా గోర్. ఈ సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు అనే పేరుతో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముద్దు ముద్దు మాటలతో.. అవికా ఎంతో అందంగా కనిపించింది. ఈ చిన్నారి నవ్వితే ప్రేక్షకులు నవ్వారు.. ఏడిస్తే ఏడ్చారు. అలా బాలనటి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఈ అందాల భామ తాజా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆమె చేసిన హాట్ కామెంట్స్ వివరాల్లోకి వెళితే..
సీరియల్ అయిపోయినా.. ఆమె హీరోయిన్ గా మారినా.. ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ అవికా చిన్నారి పెళ్లికూతురుగానే మిగిలిపోయింది. అందరి బాలనటులులానే పెద్దయ్యాక అవికా కూడా హీరోయిన్ గా మారింది. తెలుగులో ఉయ్యాలా జంపాలా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక వరుస అవకాశాలు దక్కించుకున్న అవికా.. విజయాలను మాత్రం అందుకోలేకపోయింది.

అమ్మడు నటించిన సినిమాల్లో కొన్ని పర్వాలేదు అన్నట్లుగా నిలిచిన కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస సినిమాలు చేయలేకపోయింది. అప్పట్లో కొంచెం ముద్దుగా బొద్దుగా ఉండే ఈ బ్యూటీ కొంత గ్యాప్ తీసుకుని న్యూ లుక్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో అయితే అందాల ఆరబోత ఓ రేంజ్ లో చేసింది. అయినా కూడా చిన్నదాని ఫేట్ మారలేదు.
పవన్ కల్యాణ్ కు వదిన సురేఖ గిఫ్ట్ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎన్ని లక్షలో తెలుసా?
ఇక అడపా దడపా తెలుగులో సినిమాలు, సిరీస్ లు చేస్తున్న అవికా హిందీలో 1920 అనే హర్రర్ కాన్సెప్ట్ మూవీ ఆఫర్ ను దక్కించుకుంది. ఇందులో హద్దుమీరి మరీ అమ్మడు శృంగార సన్నివేశాల్లో నటించిందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ శృంగార సన్నివేశాల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. సాధారణంగా ఏ హీరోయిన్ కు అయినా.. ఇంటిమేటెడ్ సీన్స్ అంటే భయం ఉంటుంది. కానీ, అవికా మాత్రం ఈ సీన్స్ చాలా బోరింగ్ గా అనిపించాయట.

హీరోలతో శృంగార సన్నివేశాలు సరదాగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నప్పుడు చాలా బోరింగ్ గా ఉంటాయి. అసలు ఆ సన్నివేశాలు చేసే సమయంలో ఏమాత్రం ఉత్సాహం ఉండదు.. కేవలం షూటింగ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ తప్ప. అలాంటి సన్నివేశాలు చేసే సమయంలో ఏది అవసరమో అదే చేస్తూ ఉంటాం. అంతే తప్ప వేరే ఫీలింగ్ ఏది ఉండదు" అని చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
అవికా ఇంత బోల్డ్ గా ఇలాంటి కామెంట్స్ చేయడంపై షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో అవికా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా కాకుండా తెలుగులో అవికా వధువు అనే వెబ్ సిరీస్ చేసింది. మొదటి సీజన్ మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. త్వరలోనే వధువు సీజన్ 2 రానుంది. ఎంత ఆండాళ్ ఆరబోత చేసినా ఎందుకో అవికాకు తెలుగులో ఛాన్స్ లు రావడం లేదు. మరి వధువు 2 కానీ, 1920 తరువాత కానీ తెలుగులో మంచి ఛాన్స్ లు అందుకుంటుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











