Ayesha Takia చేదు అనుభవం.. గోవాలో నాగార్జున హీరోయిన్‌కు తీవ్ర అవమానం!
బాలీవుడ్‌తోపాటు దక్షిణాది సినీ పరిశ్రమలో గ్లామర్ హీరోయిన్‌గా రాణించిన ఆయేషా టకియాకు చేదు అనుభవం ఎదురైంది. భర్త ఫర్హాన్ అజ్మీ పక్కనే ఉండగానే గోవా ఎయిర్‌పోర్టులో తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. అయేషా టకియాకు జరిగిన అవమానంపై ఆమె అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

గోవా ఎయిర్‌పోర్టులో అనుచితంగా
హీరోయిన్ అయేషా టకియా తన భర్త, కుమారుడితో కలిసి విహారయాత్రకు గోవాకు వెళ్లారు. గోవా నుంచి ముంబైకి వస్తున్న సమయంలో ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. ఇద్దరు సీనియర్ అధికారులు ఆయేషాపై అభ్యంతరకరంగా మత, వర్ణ వివక్షకు సంబంధించిన కామెంట్లు చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

ఆయేషా టకియాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు
ఆయేషా టకియాతోపాటు తమకు జరిగిన అవమానం గురించి ఫర్హాన్ అజ్మీ సోషల్ మీడియాలో వివరించారు. తమపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇద్దరు సెక్యూరిటీ అధికారులపై ఫిర్యాదు చేశాను. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు లేఖ పంపాను. సోషల్ మీడియాతోపాటు ఇద్దరు అధికారుల ఫోటోలను కూడా ఆయన షేర్ చేయడం గమనార్హం.

ఉన్నతాధికారులకు ఆయేషా భర్త ఫిర్యాదు
సోషల్ మీడియాలో ఆయేషా టకియా రాసిన లేఖ ప్రకారం.. సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ అధికారులకు విన్నపం. మేము గోవా నుంచి ముంబైకి ఇండిగో విమానంలో ఆదివారం సాయంత్రం ప్రయాణించాం. ఆ సమయంలో ఆర్పీ సింగ్, ఏకే యాదవ్ నన్ను నా కుటుంబాన్ని అడ్డగించారు. నా కుటుంబాన్ని పక్కన నిలబెట్టారు. నా పేరు గట్టిగా పలుకుతూ వాళ్ల టీమ్ మెంబర్స్‌తో వెకిలిగా ప్రవర్తించారు అని తెలిపారు.

నా భార్యను ఫిజికల్‌గా టచ్ చేస్తూ..
ఆయేషా టకియా భర్త మరో ట్వీట్ చేస్తూ.. నేను, నా కుటుంబ సభ్యులు సెక్యూరిటీ చెక్ కోసం లైన్‌లో నిలబడ్డాం. అయితే మమ్మల్ని ఆ క్యూ నుంచి తప్పించి.. మరో లైన్‌లో నిలుచోమని చెప్పారు. మాతోపాటు లైన్‌లో ఉన్న ఇతరులను సెక్యూరిటీ చెక్‌కు అనుమతించారు. అయితే ఆ సమయంలో నా భార్యను ఫిజికల్‌గా ఓ అధికారి టచ్ చేశాడు. తన భార్యపై లైంగిక వేధింపుల కామెంట్ చేశాడు. దాంతో మమ్మల్ని నెట్టి వేయవద్దు. నా భార్యకు దూరంగా ఉండాలని సూచించాను. ఈ ఘటనపై ఉన్నత అధికారులు చర్య తీసుకోవాలి అని ఫర్హాన్ అజ్మీ డిమాండ్ చేశారు.

ఆయేషా టకియా సినీ కెరీర్ ఇలా
ఆయేషా టకియా కెరీర్ విషయానికి వస్తే.. టార్జాన్: ది వండర్ కార్ అనే చిత్రంతో బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం డోర్, క్యాష్, బ్లడ్ బదర్స్, నో స్మోకింగ్, వాంటెడ్, పాఠశాల చిత్రాల్లో నటించారు. ఆమె 2011లో మోడ్ సినిమాలో చివరిసారిగా కనిపించారు.


Click it and Unblock the Notifications











