నిధి అగర్వాల్ జిమ్ వర్కవుట్స్.. అలా లేపేసి దిమాక్ ఖరాబ్ చేసింది.. వైరల్ వీడియో

నిధి అగర్వాల్ ఈ పేరు వినగానే ఠకీమని గుర్తొచ్చేది ఇస్మార్ట్ పాప. ఈ అమ్మడు తన కెరీర్‌లో ఇప్పటిదాకా చేసింది మూడే మూడు సినిమాలు అయితే అందులో ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆమెకు సూపర్ డూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది.తొలి రెండు పెద్దగా సక్సెస్ కాకపోయినా మూడో సినిమా 'ఇస్మార్ట్ శంకర్' మాత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో నిధి అగర్వాల్ క్రేజీ హీరోయిన్‌గా మారింది.

రామ్ గోపాల్ వర్మ లాంటి బడా డైరెక్టర్ కూడా నిధి అందాలకు ఫిదా అయిపోయాడు. వెండితెరపై గ్లామర్ వడ్డించడంలో తనను మించిన హీరోయిన్ లేదన్నట్లుగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి ఇచ్చిన ట్రీట్ యూత్ ఆడియన్స్‌ని బాగా అట్రాక్ట్ చేసి దిమాక్ ఖరాబ్ చేసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోను నిధి అగర్వాల్ యమ స్పీడ్. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ ఇస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటోంది ఈ యంగ్ హీరోయిన్.

ismart shankar Beauty Nidhhi Agerwals video viral on Social Media

ఈ మేరకు తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియో షేర్ చేసి ఫుల్లుగా అట్రాక్ట్ చేసింది నిధి అగర్వాల్. జిమ్‌లో ఓ పెద్ద డంబెల్ లేపుతూ ఈ వీడియోలో దర్శనమిచ్చింది నిధి. ఆ డంబెల్ ని అలా బలవంతంగా లేపేసి ఇలా కూడా దిమాక్ ఖరాబ్ చేసింది ఈ ఇస్మార్ట్ సుందరి. అమ్మడి వర్కవుట్స్ చూస్తుంటే గ్లామర్ ఇంకాస్త రెట్టింపు చేసి యూత్ ఆడియన్స్‌కి మరింత గిలిగింతలు పెట్టే ప్రయత్నమేమో అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X