తమిళ స్టార్ హీరోతో ఇస్మార్ట్ భామ.. ఆమే స్వయంగా ఒప్పుకుంది

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమాగా ఇస్మార్ట్‌గా హీరో హీరోయిన్ల కెరీర్ మలుపు తిప్పేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి దాకా కొందరు ఆడియన్స్‌కే పరిచయమై ఇస్మార్ట్ భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరూ ఇస్మార్ట్ శంకర్ విడుదల తర్వాత టాలీవుడ్ హాట్ హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పూరి మార్క్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి, నభా అందాలు బాగా ఫోకస్ అయ్యాయి. దీంతో ఆ ఇద్దరు భామల కెరీర్‌కి పూల బాటలు పడ్డాయి.

ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు తమిళ దర్శకనిర్మాతల చూపు కూడా ఇస్మార్ట్ భామలపై పడిందట. తాజాగా ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ ఓ తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ విజయంతో మంచి జోష్‌లో ఉన్న నభా నటేష్.. కాసేపు ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులతో చిట్ చాట్ చేసింది. ఈ చాట్‌లో భాగంగా తాను త్వరలో ఓ తమిళ సినిమా చేయబోతున్నానని, అది కూడా స్టార్ హీరో సరసన అని పేర్కొంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారని నభా తెలిపింది. దీంతో ఇప్పటిదాకా కన్నడ, తెలుగు ప్రేక్షకులనే పలకరించిన నభా అందాలు ఇకపై తమిళ ఆడియన్స్‌ని కూడా గిలిగింతలు పెట్టనున్నాయని తేలిపోయింది.

 ismart shankars Heroine Nabha Natesh Got Kollywood Chance

మరోవైపు నభా నటేష్ తన రెమ్మ్యూనరేషన్ కూడా పెంచేసిందని వార్తలు వస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు నభా నటేష్ రెమ్మ్యూనరేషన్‌ 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగిందని టాక్. మొత్తానికి ఇస్మార్ట్ విజయం నభా నటేష్‌కి బాగా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో నటిస్తోంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ మరో హీరోయిన్. ఇది కూడా హిట్ అయ్యిందంటే ఇక నభా నటేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోవటం ఖాయమే. సౌత్ స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లే!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X