Keerthy Suresh: డిజాస్టర్లతో కీర్తి సురేష్.. ముఖం చాటేసినా వదలని మహానటి!

హిందీ సినిమా నుంచి తెలుగు సినిమాకి అలాగే సౌత్ లో ఇతర భాషల్లోకి వచ్చిన హీరోయిన్స్ అలాగే ఇక్కడ సెటిల్ అయ్యిపోయి స్టార్ హీరోయిన్స్ కూడా చాలా మందే కనిపిస్తారు. కాగా వారిలానే మన నుంచి కూడా చాలా మంది సౌత్ నుంచి హిందీ సినిమాకి వెళ్లి స్టార్స్ అవుదాం అనుకున్నవారు మాత్రం అక్కడ సరైన అవకాశాలు కూడా దక్కించుకోలేకపోయారు.

కాగా ఇప్పుడు మాత్రం కొంతమంది సౌత్ బ్యూటీస్ హిందీ మార్కెట్ లో హవా కనబరుస్తున్నారు. మెయిన్ గా కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా హిందీ సినిమాలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో హిందీ సినిమాలో రష్మిక సంచలనంగా మారగా ఆమెతో పాటుగా సమంత ఓటిటి పరంగా హిట్ అయ్యి హిందీ ఆడియెన్స్ లో క్లిక్ అయ్యింది.

Keerthy Suresh

ఇక వీరితో పాటుగా హిందీ మార్కెట్ లో అదరగొట్టాలని చూసిన మరో స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మహానటి కీర్తి సురేష్ అని చెప్పాలి. అప్పుడు వరకు బాగా సెటిల్డ్ గా సౌత్ లో కనిపించిన కీర్తి సురేష్ హిందీ సినిమాలో మొదట ఆఫర్ కే మొత్తం స్కిన్ షో ఓ రేంజ్ లో చేసేసింది. తాను బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చిత్రమే "బేబీ జాన్" కాగా ఈ చిత్రంలో హీరో వరుణ్ ధావన్ సరసన ఆమె నటించింది.

కాగా ఈమె నటించిన మొదటి సినిమానే అక్కడ ప్లాప్ కావడంతో కీర్తి సురేష్ ఒకింత బాగా డిజప్పాయింట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫలితం తర్వాత ఆమెకి పెద్దగా ఆఫర్స్ కూడా అక్కడ నుంచి లేవు అనే టాక్ కూడా వచ్చింది. కానీ హిందీ మార్కెట్ ని మాత్రం కీర్తి సురేష్ సీరియస్ గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమెకి బాలీవుడ్ లో వర్క్ చేయడం బాగా నచ్చిందట.

యాంకర్ శ్యామలకు నోటీసులు.. అరెస్ట్‌ తప్పదా? ఆ ఇద్దరు పరారీలో.. ఈడీ రంగ ప్రవేశం

అందుకే అక్కడ నుంచి అంత త్వరగా బయటకి వచ్చేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తుంది. అంతే కాకుండా హిందీ ఆడియెన్స్ కి మరింత దగ్గర అయ్యిపోవాలని ఆమె ఏకంగా హిందీ కూడా నేర్చేసుకుంటుందట. ప్రస్తుతం కీర్తి ఈ పనుల్లోనే ఉండగా ఆమె తనని బాలీవుడ్ జనం అలాగే హిందీ మార్కెట్ ఆడియెన్స్ ఒక బయట అమ్మాయిగా చూడకూడదు అని ఫిక్స్ అయ్యిందట.

అందుకే భాషతో దూరం కాకూడదు అని హిందీ నేర్చుకునే పనిలో ఉన్నట్టుగా ఇపుడు సమాచారం. ఇలా సౌత్ లో ఆమెకి పెద్దగా అవకాశాలు లేకపోయేసరికి హిందీ మార్కెట్ లో ఏదొకలా సస్టైన్ అయ్యేందుకు ఈ బ్యూటీ ట్రై చేస్తుంది అని చెప్పవచ్చు. కాగా తెలుగులో సహా తమిళ్ లో కూడా కీర్తి సురేష్ చేతిలో పెద్దగా సినిమాలు ఏవి లేవు.

టాలీవుడ్ వరకు అయితే కలర్ ఫోటో హీరో సుహాస్ తో ఓ వెబ్ సిరీస్ ని ఈమె చేసింది. ఇదెప్పుడు వస్తుంది ఏంటి అనేవి మాత్రం ఇంకా బయటకి రాలేదు. అలాగే రీసెంట్ గానే అక్క అనే వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ కి ఓకే చేసింది. కాగా గత ఏడాదిలోనే కీర్తి సురేష్ తన చిరకాల ప్రేమికుడిని పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: keerthy suresh baby john akka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X