అలా ఉంటేనే పిల్లలని కనండి.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్

Lakshmi Manchu: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా తనదైన స్టైల్‌తో ప్రయాణం కొనసాగిస్తున్న మంచు లక్ష్మీ. ఈ అమ్మడు తన రియల్ లైఫ్‌లో కూడా ఎంత బోల్డ్‌గా, నేరుగా మాట్లాడుతుందో అందరికీ తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మీ తన వ్యక్తిగత, కుటుంబ జీవితం, ఫైనాన్షియల్ ఫిలాసఫీ, తల్లిదండ్రుల బాధ్యతల గురించి ఓపెన్‌గా షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది.ఇంతకీ ఏమన్నారంటే?

ఇంటర్వ్యూలో ముందుగా మీకు వంటలు చేయడం వచ్చా? అని అడగగా, లక్ష్మీ నవ్వుతూ ఇలా "నాకు వంటలు రావు అంటే ఎలా అడుగుతారు? నేను ఎంత బాగా వండుతానో మా కూతుర్ని అడిగి తెలుసుకోండి" అంటూ మొదలెట్టింది. దాదాపు ఏడు సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్న సమయంలో అన్ని వంటలు తానే చేసుకునేదని పేర్కొంది.

Lakshmi Manchu s Bold Talk on Parenting Money amp amp Life Philosophy

"ఇటాలియన్, ఇండియన్, చైనీస్ అన్నీ రకాల వంటలను అద్భుతంగా చేస్తాను" అంటూ తన కుక్ స్కిల్స్‌ గురించి గర్వంగా చెప్పుకొచ్చింది. అయితే సూటిగా ఒక సీక్రెట్ కూడా చెప్పేసింది "ఇండియాలో ఉన్నప్పుడు వంట చేయాలనే ఫీల్ రావదు, కానీ బయట దేశాల్లో ఉంటే అదే వంట నాకు చాలా నచ్చుతుంది. అప్పుడు ఇక్కడి రోజులు, ఇక్కడ ఫుడ్ వాల్యూలు బాగా అర్థం అవుతాయి" అంటూ చమత్కారించింది.

లైఫ్ ఫిలాసఫీ గురించి ప్రశ్నించగా.. "ఇంతకుముందు నాకు భారం గొప్ప ఫిలాసఫీ ఉండేది. తప్పు-ఒప్పు, న్యాయం-అన్యాయం, మగ-ఆడ, ఫెమినిజం, సమాన హక్కులు... ఇవన్నీ నా తలలో తిరిగేవి. కానీ ఇప్పుడు ఆ ఫిలాసఫీ మొత్తం తీసేసి పెట్టేశా. ఇప్పుడు నా లైఫ్ ఫిలాసఫీ ఒక్కటే 'నువ్వు బతుకు... నన్ను బతకనివ్వు'. నేను నీ జీవితం జడ్జ్ చేయను, నువ్వు నా మీద తీర్పు ఇవ్వకు. ఈ తత్వంతోనే ఇప్పుడు సింపుల్‌గా, ఎక్కువ ఓవర్ థింకింగ్ లేకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా" అని ఆమె చెప్పింది.

అలాగే.. డబ్బు గురించి లక్ష్మీ అభిప్రాయం ఓపెన్ గా తన అభిప్రాయాన్ని చెప్పింది. "డబ్బు గురించి ఇప్పుడే నేర్చుకుంటున్నాను" అంటూ నేటి న్యూక్లియర్ ఫ్యామిలీ మైండ్‌సెట్‌పై కూడా మాటాడింది. "ఒక్కరి దగ్గర నాలుగు కార్లు, ఇంటికి పది కార్లు, ఎవరి సంపాదన వారిదే అన్న పద్ధతి నేటి జనరేషన్‌లో బాగా పెరిగింది" అని చెప్పింది. అసలు మనకు డబ్బు గురించి స్కూల్‌ నుంచే నేర్పించాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది.

"స్కూల్లో మ్యాథ్స్, సైన్స్‌తో పాటు 'డబ్బు ఎలా పొదుపు చేసుకోవాలి? ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఏ ఏరియాల్లో పెట్టుబడి పెట్టాలి?' అనే బేసిక్ ఫైనాన్షియల్ నలెడ్జ్ కూడా పిల్లలకు నేర్పాలి. కాలేజీ లెవెల్లో 'ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్' వంటి విషయాలు చెప్పాలి" అని తన ఆలోచనను క్లియర్‌గా చెప్పింది.

అలాగే.. స్త్రీల ఆర్థిక స్వావలంబన పై కూడా లక్ష్మీ మాట్లాడారు. "మహిళలకు గవర్నమెంట్ ఇస్తున్న ప్రయోజనాలు, పథకాలు ఏమిటి? వాటిని ఎలా యూస్ చేసుకోవాలి? అనే విషయాలు చాలా మంది మహిళలకు తెలీదు. ఇవన్నీ తెలిసి ఉండాలి. తప్పనిసరిగా తెలుసుకోవాలి" అంటూ ఫైనాన్షియల్ అవగాహన అవసరాన్ని ఆమె హైలైట్ చేసింది.ఫైనాన్షియల్ అవగాహన కూడా ఇప్పుడు అత్యంత అవసరం అని చెప్పింది.

Globe Trotter: రాజమౌళికి బిగ్ షాక్.. ఆ వీడియో లీక్ చేసిన సుమ..
ఈ మధ్యకాలంలో ఆమె తండ్రి మోహన్ బాబుతో డబ్బు విషయంలో జరిగిన సంభాషణను వెల్లడించింది. "ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి నేను మా నాన్నగారిని చాలా సార్లు అడిగాను. ఆయన ఇచ్చే ఒక్కటే సమాధానం 'డబ్బులు ఖర్చు పెట్టకూడదు, పొదుపు చేయాలి' అని. కానీ నేనంటా.. ఖర్చు పెట్టాలంటే ముందుగా డబ్బులు ఉండాలి కదా? అలాగే డబ్బు ఖర్చు పెట్టకూడదు మాత్రమే కాదు, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అనేది కూడా నేర్పించాలి" అని తన లాజిక్ వివరించింది. "నేను సంపాదించింది నేనే ఖర్చు పెట్టాలి. లేకపోతే ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించండి. ఎంత సేవింగ్స్‌ చేయాలి, ఎంత ఎంజాయ్‌మెంట్‌ కోసం వాడాలి అన్న బ్యాలెన్స్ నేర్పాలి" అని లక్ష్మీ చెప్పింది.

మోహన్ బాబు తనకు డబ్బు విషయంలో ఇచ్చే 'చిన్న' ఆఫర్‌ కూడా ఆమె తన స్టైల్లో చెప్పేసింది. "మా నాన్న అంటాడు 'నువ్వు సంపాదించింది నువ్వే ఖర్చు పెట్టుకో. నా తర్వాత నీకు ఇస్తాను'అని. అప్పుడు నేనంటా థ్యాంక్యూ! నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, 70 సంవత్సరాల తర్వాత ఇస్తే నేను ఏం చేసుకోవాలి? అప్పటికి మోకాళ్లు కూడా సరిగ్గా ఉండకపోవచ్చు" అంటూ సెటైరికల్‌గా చెప్పింది.

పిల్లల చదువుల ఖర్చుల గురించి మాట్లాడు తూ.. ప్రస్తుత తరం తల్లిదండ్రులకు ఒక కఠినమైన సత్యాన్ని కూడా గుర్తు చేసింది. "నేడు నా కూతురి ఏడాది చదువు కోసం పెట్టే ఖర్చు, నేను మొత్తం చదువుకున్న ఏళ్ల్లో పెట్టిన ఖర్చుకంటే ఎక్కువ. ఇది నేటి ఎడ్యుకేషన్ రియాలిటీ" అని ఆమె చెప్పింది. "నీకు పిల్లలు కనాలంటే, నీకు ఆర్థిక స్తోమత, మానసిక స్థైర్యం రెండూ ఉండాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకరి సంపాదన చాలదు. కుటుంబానికి కనీసం ఇద్దరి ఆదాయం అవసరం" అని స్పష్టంగా చెప్పింది. పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం చేస్తే, ఒక్క తరం మొత్తం డ్యామేజ్ అవుతుందని కూడా లక్ష్మీ హెచ్చరించింది.

"పిల్లల ప్రతి చిన్న విషయం కూడా జాగ్రత్తగా చూడాలి. ముఖ్యంగా వారి భద్రత, వాళ్ల మెంటల్ హెల్త్, ఎడ్యుకేషన్ గురించి చాలా శ్రద్ధ అవసరం. ఫ్యూచర్ చాలా ఎక్స్పెన్సివ్. పిల్లల కోసం భారీ స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. కాని చాలా మంది తల్లిదండ్రులు ఇప్పటికీ ఈ రియాలిటీని సీరియస్‌గా తీసుకోవడం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక చదువు, కెరీర్ ఎంపిక విషయంలో తల్లిదండ్రులు మైండ్‌సెట్ మార్చుకోవాల్సిన బాధ్యత ఉందని లక్ష్మీ అభిప్రాయపడింది. "పిల్లలు ఏమి చదివితే భవిష్యత్తులో ఎలా సెట్ అవుతారు? వాళ్ల టాలెంట్ ఏ దిశలో ఉంది? ఈ విషయాలను అర్థం చేసుకుని, తగిన చోట ఖర్చు పెట్టాలి. వాళ్లకి స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మనం చాలా విషయాల్లో కోతలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ముందే ప్లాన్ చేసుకోవాలి" అని ఆమె తల్లిదండ్రులకు సూచించింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X