‘స్టార్ హీరోకు మనవరాలిగా చేశా.. ఇప్పుడు హీరోయిన్‌గానా?’ స్టార్ బ్యూటీకి డైరెక్టర్ షాక్
వెండితెర మీద రారాణిగా వెలిగిపోయిన హీరోయిన్లలో శ్రీదేవీ ఒకరు. అందం, అభినయంతో ఆమె ఎంతో మందిని అభిమానులుగా మార్చేసుకొన్నారు. తెలుగు మాత్రమే కాకుండా దక్షిణాదితోపాటు ఉత్తరాదిలో కూడా స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. హిందీ, తమిళం, తెలుగులో ఆమె నటించిన సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. అయితే గతంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవీ మాట్లాడుతూ.. రాఘవేంద్రరావుతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొన్నారు. ఆమె చెప్పిన మాటలు మీరే చూడండి..
Thala: సారీ.. డిస్ట్రబ్ చేశాను.. కంటతడి పెట్టిన అమ్మ రాజశేఖర్
దర్శకుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఆయన సినిమాలో పనిచేసిన ప్రతీ హీరోయిన్ ఒక డ్రీమ్ గర్ల్ అవుతుంది. మేము చేసిన ప్రతీ సినిమా హిట్.. ప్రతీ పాట హిట్. నేను రాఘవేంద్రరావు కలిసి పనిచేసిన మొదటి సినిమా పదహారేళ్ల వయసు అని తన గత అనుభవాలను శ్రీదేవీ గుర్తు చేసుకొన్నారు.

ఒక రోజు రాఘవేంద్రరావు నా వద్దకు వచ్చారు. ఆయనతో మాట్లాడుతూ.. మీకు ఓ షాకింగ్ న్యూస్ ఇవ్వబోతున్నానని చెప్పాడు. నువ్వు నేను కలిసి మళ్లీ వర్క్ చేయబోతున్నాం అని చెప్పారు. దాంతో అది షాకింగ్ న్యూస్ ఎలా అవుతుంది? మంచి న్యూస్ కదా అని ఆయనను ప్రశ్నించాను. దాంతో లేదు లేదు నువ్వ ఓ పెద్ద హీరోతో కలిసి నటిస్తున్నావు అని చెప్పారు.
అయితే రాఘవేంద్రరావు పెద్ద హీరో అని చెప్పగానే.. నాలో ఆసక్తి పెరిగింది. వెంటనే ఆ పెద్ద హీరో ఎవరో చెప్పండి అని అన్నాను. అయితే కాసేపటికి ఆయన ఎవరో కాదు.. ఎన్టీ రామారావు గారు. ఆయనతో నీవు నటించబోతున్నావని చెప్పారు. దాంతో నేను నిజంగానే షాక్ గురయ్యాను అని శ్రీదేవి చెప్పారు.

అయితే ఎన్టీ రామారావు పక్కన హీరోయిన్‌గా అని చెప్పగానే.. సార్ నేను.. ఇంతకు ముందు నేను ఆయన పక్కన నేను మనవరాలిగా నటించాను. నేను ఎలా హీరోయిన్‌గా చేయగలగుతాను అని అడిగాను. దాంతో మీరు భయపడొద్దు.. నేను ఉన్నాను కదా.. ఎన్టీఆర్‌తో కూడా చెప్పాను. ఆయన కూడా ఒప్పుకొన్నారు. నేను చాలా సంతోషంలో మునిగిపోయాను అని శ్రీదేవీ చెప్పారు. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో వైరల్ అవుతున్నది.
గతంలో శ్రీదేవీ, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ఈ సినిమాలు భారీ కలెక్షన్లు వసూలు చేయడంతో సూపర్ హిట్ అందుకొన్నాయి. వారిద్దరి జోడి క్రేజీగా మారింది. వారు నటించిన సినిమాల్లో వారి పాత్రల మధ్య ఉండే కెమిస్ట్రీ అభిమానులను ఆలరించింది. వారిద్దరి కలిసి నటించిన సినిమాల్లోని పాటలు అన్ని వర్గాలను ఆకట్టుకొన్నాయి.


Click it and Unblock the Notifications











