‘పబ్‌ నుంచి ఆ హోటల్‌కి తీసుకెళ్లి... వాళ్ల నుంచి అలా తప్పించుకున్నా’

అందం, అభినయం ఉన్నప్పటికీ తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు లభించడం లేదు. ముంబై, బెంగళూరు లేదా ఇతర ప్రాంతాల నుంచి భారీ రెమ్యునరేషన్లు, ఇతర సదుపాయాలు కల్పించి టాలీవుడ్‌కు తెచ్చుకుంటున్న దర్శక నిర్మాతలు.. లోకల్ టాలెంట్‌ను మాత్రం ప్రోత్సహించడం లేదు. తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చినా ఒకటి అరా సినిమాలకే ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఈ కోవలోకే వస్తారు మాధవీ లత. కొన్నాళ్లు సినిమాలలో హల్‌చల్ చేసిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి చేరారు. ప్రస్తుతం బీజేపీ తరపున పనిచేస్తున్నారు. సినిమాలతో పాటు పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవీ లత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
ఆ వ్యక్తి వల్ల 6 నెలలు నరకం.. ఆ ఒక్క తప్పుతో.. భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్
ఆ వ్యక్తి వల్ల 6 నెలలు నరకం.. ఆ ఒక్క తప్పుతో.. భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్

2008లో నచ్చావులే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మాధవీలత ఫస్ట్ మూవీతోనే మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుందని అనుకున్నారు. దీనికి తగినట్లుగానే స్నేహితుడా, ష్, ఉసురు, అరవింద్ 2, తొలిపాట వంటి వరుస సినిమాలు చేశారు. టాలీవుడ్‌లో అదృష్టం కలిసిరాకపోవడంతో కోలీవుడ్ వైపు వెళ్లారు. కానీ అక్కడ కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సినిమాలలో అవకాశాలు రాకపోవడం, ఇతరత్రా కారణాలతో మాధవీలత ఆధ్యాత్మిక బాటపట్టారు. కృష్ణ భక్తురాలిగా కన్నయ్య సన్నిధిలో గడుపుతున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి యాక్టీవ్‌గా వ్యవహరించారు. అయితే అడపాదడపా ఇంటర్వ్యూలు ఇస్తూ అందులో సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. కొద్దిరోజుల క్రితం ఓ తెలుగు జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Madhavi Latha Opens Up on Pub Culture Friendships and Why She Walked Away from Her Party Circle

నాకు తెలియకుండానే నేను శ్రీకృష్ణుడి భక్తురాలిగా మారిపోయా. ఎలా ఉండేదానివి.. చీరిగిన జీన్స్‌లు వేసి, ముక్క తింటూ.. ఛాయ్ తాగేదానివి ఎలా మారిపోయావని నా ఫ్రెండ్స్ ఏడిపిస్తుంటారు. ఈ మధ్యకాలంలో పిల్లలు లవ్ ఫెయిల్యూర్స్‌తో బాధపడుతున్నారు.. సొసైటీలో చాలా మార్పులు వచ్చాయి. ఫారిన్‌లో 18 ఏళ్ల వరకు పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు, ఆ తర్వాత ఎవరి జీవితం వాళ్లదే. చెడు ఎక్కినంత ఈజీగా మంచి ఎక్కదు.. వాల్యూస్ అంటే సోది అయిపోయింది. బర్గర్లు, పిజ్జాలు తినేదానికి.. అమ్మ చేసే పప్పన్నం, కూరన్నం తినడానికి చాలా తేడా ఉంది. మేం కాలేజీకి వెళ్లే రోజుల్లో మొబైల్స్ లేవు, ఇల్లు, కాలేజీ తప్పించి ఏం ఉండేవి కావు అని మాధవీ లత గుర్తుచేసుకున్నారు.

Recommended For You
ఆ నటితో శృతి మించిన శృంగారం.. వయాగ్రా ఓవర్‌డోస్‌తో డైరెక్టర్ మృతి? మరో హీరోయిన్ లీక్!
ఆ నటితో శృతి మించిన శృంగారం.. వయాగ్రా ఓవర్‌డోస్‌తో డైరెక్టర్ మృతి? మరో హీరోయిన్ లీక్!

నైట్ కల్చర్‌పై మాధవీ లత మాట్లాడుతూ.. బెంగళూరులో రాత్రిపూట ఫుడ్ దొరకడం చాలా కష్టం. హైదరాబాద్‌లో ప్రతి వీధిలో ఫుడ్ దొరుకుతుంది. బెంగళూరులో ఎంజీ రోడ్‌లో ఒక్క రెస్టారెంట్ ఓపెన్‌లో ఉండేది, అక్కడ కూడా చాలా మంది పోలీసులు ఉండేవారు. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఒకరి మీద ఒకరుపడిపోతుండేవారు. మనం భారతదేశంలో ఉన్నామా? అమ్మాయిలకు బట్టలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలియదు. అలా తిరిగేవారిలో కొందరు బాయ్‌ఫ్రెండ్స్‌ ఉంటారు.. ఆల్రెడీ పెళ్లయిన వారు కూడా ఉంటారు. నా భార్య నాకు హాట్‌గా కనిపించాలని వాడు అనుకుంటే మనం ఏం చేయలేం కదా? అని మాధవీ లత చెప్పారు.

You May Also Like
యాంకర్ రష్మీని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. ఇన్నాళ్లు ఈగోలు అడ్డొచ్చాయంటూ..
యాంకర్ రష్మీని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. ఇన్నాళ్లు ఈగోలు అడ్డొచ్చాయంటూ..

నగరాలలో పబ్‌ సంస్కృతి గురించి మాధవీ లత మాట్లాడుతూ.. పబ్‌కి వెళ్తున్నాం కదా హాట్‌గా కనిపించాలని అమ్మాయిలు అలా రెడీ అవుతున్నారు. హైదరాబాద్‌లో తెల్లవారుజామున 3 గంటల వరకు పబ్బులు తెరిచే ఉంటున్నాయి. ఒకప్పుడు జమానా కాలంలో 11.55 గంటలు అయితే చాలు లైట్స్ ఆన్ అయ్యేవి. 12 గంటలకు అందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలి.. కానీ అక్కడి నుంచి నోవాటెల్ హోటల్ దగ్గరికి వెళ్లేవారు. ఇక్కడ సగమే తాగి ఉండేవారు.. 12 గంటలకు ఆ కిక్ సరిపోదు. దాంతో నోవాటెల్‌కు పరిగెత్తేవారు. నా ఫ్రెండ్స్ అక్కడికి తీసుకెళ్తే బిల్ నేను కట్టేదానిని. అక్కడ తెల్లారే వరకు తాగేవారు. నేను కారం ఇడ్లీ తింటూ కూర్చొనే దానిని. తాటి చెట్టు కింద కూర్చొని కళ్లు తాగడం లేదంటే ఎవరూ నమ్మరు కదా? నన్ను బిల్ కట్టడానికి పిలుచుకొని వెళ్లేవారు.

200 కోట్లతో జన నాయగన్ సంచలనం.. టాప్ 10లో విజయ్ మూవీ.. హాలీవుడ్‌కు షాక్!
200 కోట్లతో జన నాయగన్ సంచలనం.. టాప్ 10లో విజయ్ మూవీ.. హాలీవుడ్‌కు షాక్!

నాలుగు సార్లు అలాగే హోటల్‌కి తీసుకెళ్లా.. మా ఫ్రెండ్స్‌కి ఇదే అలవాటుగా మారడంతో ఐదోసారి నా దగ్గర డబ్బులు లేవని చెప్పా. అలా కట్ అయిపోవడంతో ఆ రోజు నుంచి వాళ్లు నాతో మాట్లాడటం మానేశారు. డబ్బులు లేనప్పుడు ఎవరూ రారూ కాదు కదా? రోజుకొక రీజన్‌తో నన్ను హోటల్‌కి తీసుకెళ్లేవారు. వాళ్లందరినీ కట్ చేసిన తర్వాత జీవితం ప్రశాంతంగా ఉంది. ఇదంతా 2014లో మాట... నా ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం పబ్‌కి చివరిసారిగా వెళ్లా. మనకోసం పబ్‌లో పార్టీ పెట్టొద్దని చెప్పకూడదు కదా? ఒక అర్ధగంట ఉండి వచ్చేశానని మాధవి లత తేల్చేశారు. అవకాశాల కోసం నేనెప్పుడూ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల వెంట పడలేదు. మీరెప్పుడూ వివాదాల్లో ఉంటారని చెప్పేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మాధవీ లత పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X