52 ఏళ్ల వయసులో నమత్రా శిరోద్కర్ అందాల ధగధగలు .. అలాంటి మోడ్రన్ లుక్‌లో మహేష్ బాబు భార్య!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, సీనియర్ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1993లో మిస్ ఇండియాగా కూడా ఎంపికై అందరినీ మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో చేసింది. ప్రస్తుతం నమ్రతా శిరోద్కర్.. మహేష్ బాబు భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటోంది. ప్రస్తుతం 52 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ తాజాగా అల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

August 15th 2024: అందరి కళ్లు ఆరోజుపైనే.. ఒకే రోజు ఏడు పెద్ద సినిమాల విడుదలకు ప్లాన్!
సాధారణంగా ఎవరికి అయనా సరే వయసు పెరుగుతుంది అంటే మొహంపై ముడతలు రావడం, వృద్ధాప్య ఛాయలు కనిపించడం సహజమే. కానీ 52 ఏళ్ల వయసు కల్గిన నమ్రతా మాత్రం రోజురోజుకూ మరింత అందంగా తయారు అవుతుంది. పాతికేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తూ కుర్రకారు కళల రాణిగా ఇంకా కొనసాగుతోంది. భర్త మహేష్ బాబు లాగే ఈమె కూడా స్పెషల్ డైట్ ఫాలో అవుతూ తన అందాన్ని కాపాడుకుంటూ వస్తోంది. అంతేకాకుండా జిమ్ లో కసరత్తులు చేస్తూ చాలా ఫిట్ గా ఉంటోంది. ఓవైపు అందాన్ని కాపాడుకోవడం, ఇంటిని, భర్తను, పిల్లలను చూసుకోవడంతో ఫుల్ బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Mahesh Babu Wife Namrata Shirodkar Ultra Modern Look Photos Goes Viral

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే తరచుగా కొత్త కొత్త ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో అదిరిపోయే అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో కనిపిస్తుంటుంది. వైట్ కలర్ షర్టుతో పాటు బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుని టై కూడా ధరించింది. వైట్ కలర్ టైట్ షర్టులో ఆమె అందాలు అదిరిపోయాయి.

Mahesh Babu Wife Namrata Shirodkar Ultra Modern Look Photos Goes Viral

అలాగే వైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని మరింత స్టైలిష్ లుక్ లో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నమ్రతా ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేధికగా షేర్ చేయగా.. కొన్ని గంటల్లోనే ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. మహేష్ బాబు తో పాటు నమ్రతా ఫ్యాన్స్ ఈ ఫొటోలకు లైకులు కొడుతూ రచ్చ చేస్తున్నారు. ఫొటోలు వైరల్ అయ్యేలా షేర్లు చేస్తూ నమ్రతా అందాలను పొగుడుతున్నారు. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై లుక్కేసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X