ఆ కిక్ నుంచి బయటకు రాలేకపోతున్నా.. ఎంతివ్వాల్లో వాళ్లకు బాగా తెలుసు.. ఇస్మార్ట్ బ్యూటీ
తెలుగు చిత్రసీమలో కొత్త అందాలు వరుస అవకాశాలు అందుకుంటున్నాయి. యంగ్ హీరోయిన్స్, అది కూడా కొత్త హీరోయిన్లను తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సత్తా చాటిన ఈ భామ ఫుల్ బిజీ అయింది.
అయితే వరుస అవకాశాలు వస్తుండటంతో నభా నటేష్ తన పారితోషికం అమాంతం పెంచేసిందని వార్తలు షికారు చేశాయి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై ఆసక్తికరంగా స్పందించింది నభా నటేష్. పారితోషికం పెంచేశానని వస్తున్న వార్తలన్నీ అబద్ధాలేననీ, తనకు ఎంతివ్వాలో దర్శకనిర్మాతలకు బాగా తెలుసని చెప్పింది.

2019 సంవత్సరం తనకు బాగా కలిసొచ్చిందని నభా పేర్కొంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ అందుకున్నాను. ఆ సినిమా విజయం మంచి కిక్ ఇచ్చింది. ఆ కిక్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నానని ఆమె అంటోంది. ఎక్కడికి వెళ్లినా, ఆ సినిమాలోని సాంగ్స్ పాడమని, డైలాగ్స్ చెప్పమని అడుగుతున్నారని, టోటల్ గా చూస్తే 2019 తనకు బెస్ట్ ఇయర్ అని చెప్పింది నభా నటేష్.
ఇటీవలే రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సరసన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలో నటిస్తోంది. ఇందులో తన పాత్ర డిఫరెంట్‌గా ఉంటుందని అంటోంది నభా. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్నానని, దీంతో పాటు తమిళంలో ఓ సినిమా చర్చల్లో ఉందని తెలిపింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.


Click it and Unblock the Notifications











