పూరీ జగన్నాథ్ పడుకుని నాతో ఆ పని చేయించుకున్నాడు.. మహేశ్ నన్ను అలా చూశాడు: తెలుగు హీరోయిన్

టాలీవుడ్‌లో లోకల్ అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో బాగానే సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో గోదావరి జిల్లా నటి శ్రీ రాపాక ఒకరు. రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి వెలుగులోకి వచ్చిన ఈ భామ.. ఆ తర్వాత సినిమాలు, రాజకీయాలు చేస్తూ సెన్సేషన్‌గా మారిపోయింది. ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించని శ్రీ రాపాక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలను మీరే చూడండి!

నగ్నంతో సంచలనంగా
సినిమాలపై ఉన్న ఆసక్తితో శ్రీ రాపాక ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంటరైంది. అందులో తనదైన అందాలతో మెప్పించిన తర్వాత రాంగోపాల్ వర్మ డెన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా అతడి దర్శకత్వంలో శ్రీ రాపాక 'నగ్నం' అనే సినిమాలో నటించింది. ఇందులో తనదైన గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఫలితంగా ఈ అమ్మడు ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది.

Nagnam Heroine Shree Rapaka Sensational Comments on Puri Jagannadh

కలిసి రాని బిగ్ బాస్ షో

వర్మ తెరకెక్కించిన 'నగ్నం' సినిమాతో శ్రీ రాపాక ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో ఆఫర్ అందుకుంది. ఇందులోకి ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ అమ్మడు.. స్టార్టింగ్‌లోనే ఎలిమినేట్ అయింది. అయినా ఆమెకు మంచి పేరు వచ్చింది. అదే సమయంలో శ్రీ రాపాకకు కొన్ని అవకాశాలు వచ్చాయి.

Nagnam Heroine Shree Rapaka Sensational Comments on Puri Jagannadh

సినిమా టూ పాలిటిక్స్
శ్రీ రాపాకకు బిగ్ బాస్ తర్వాత బోల్డు సినిమాల్లో మాత్రమే అవకాశాలు లభించాయి. కానీ, వాటిని చేయడానికి ఆమె సిద్ధం కాలేదు. కానీ, ఈ మధ్యన మాత్రం ఈ తెలుగు హీరోయిన్ 'గులాబీ', 'మరణం' వంటి చిత్రాలను చేసింది. ఇవి ఆమెకు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక, శ్రీ రాపాక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి గత ఎన్నికల్లో కూటమి తరపున ప్రచారం కూడా నిర్వహించింది.

Nagnam Heroine Shree Rapaka Sensational Comments on Puri Jagannadh

పూరీ జగన్నాథ్ క్లోజ్‌గా

రాంగోపాల్ వర్మ హీరోయిన్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న శ్రీ రాపాక తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్‌తో ఉన్న బంధం గురించి బయటపెట్టింది. 'నేను కాలేజ్ చదివే రోజుల్లో పూరీ జగన్నాథ్ గారి ఆఫీస్‌కు రోజూ వెళ్లేదాన్ని. ఆయన నాతో చాలా క్లోజ్‌గా ఉండేవారు. నన్ను బాగా చూసుకునేవారు' అంటూ చెప్పుకొచ్చింది.

పడుకుంటే అలా చేశా
ఈ ఇంటర్వ్యూలో శ్రీ రాపాక కంటిన్యూ చేస్తూ.. 'నేను ప్రతిరోజూ పూరీ గారి దగ్గరకు వెళ్తూ ఉండేదాన్ని. ఆయన నేల మీదనే పడుకునేవారు. ఒకసారి ఆయన అలా పడుకుని కాళ్లు మీద ఎక్కమన్నారు. నేను పైకి ఎక్కి ఆయన కాళ్లు నొక్కాను. ఆయన నాకు అన్నం పెట్టేవారు. ఏది కావాలన్నా అడగమనే వారు. అంతలా నన్ను పూరీ సార్ కేర్ తీసుకున్నారు' అంటూ వివరించింది.

Nagnam Heroine Shree Rapaka Sensational Comments on Puri Jagannadh

మహేశ్ కూడా చూశాడు

శ్రీ రాపాక కొనసాగిస్తూ.. 'నేను పూరీ సార్‌కు క్లోజ్ అయింది పోకిరి సినిమా సమయంలోనే. అందుకే తరచూ ఆఫీస్‌కు మహేశ్ గారు, ప్రకాశ్ రాజ్ గారు కూడా వచ్చేవారు. నన్ను అక్కడ చూసి ఈ పిల్ల బచ్చా ఎవరు అనుకునేవారు. ఆ తర్వాత చాలా కాలానికి నేను పూరీ గారిని జిమ్‌లో కలిశాను. అప్పుడు చాలా పెద్దదానికి అయిపోయావమ్మా అన్నారు' అని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X