బాలీవుడ్‌లోకి రామ్ పోతినేని.. ఆ బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో ఆయనే నటించాలి.. నిధి అగర్వాల్

దక్షిణాదిలో అందాల భామ నిధి అగర్వాల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పూరీ జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నారు. అయితే తనకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టిన ఇస్మార్ట్ శంకర్ గురించి జాతీయ వార్తా ఏజెన్సీతో పలు విషయాలు పంచుకొన్నారు. ఇస్మార్ట్ శంకర్ రిలీజై రెండేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా నిధి అగర్వాల్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ

బాలీవుడ్‌లో ఇస్మార్ట్ శంకర్

బాలీవుడ్‌లో ఇస్మార్ట్ శంకర్

రామ్ పోతినేనితో తాను నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే మంచి విజయం సాధిస్తుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబట్టడం ఖాయం. ఆ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తే చూడాలని ఉంది. అవకాశం వస్తే ఆ సినిమాలో కూడా తాను నటించాలని కోరుకొంటున్నాను అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

హిందీ రీమేక్‌లో రామ్ పోతినేని

హిందీ రీమేక్‌లో రామ్ పోతినేని


ఇస్మార్ట్ శంకర్ హిందీలో రీమేక్ చేస్తే.. అందులో హీరో రామ్ పోతినేని నటించాలి. హీరో రామ్ తప్ప మరొకరు ఆ పాత్రకు న్యాయం చేయలేరు. ఇస్మార్ట్ శంకర్ హిందీలో రీమేక్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అంతకంటే ఆ సినిమా గురించి పెద్దగా చెప్పలేను అని నిధి అగర్వాల్ అన్నారు.

మాస్ ప్రేక్షకుల గుర్తింపు

మాస్ ప్రేక్షకుల గుర్తింపు


అద్బుతమైన కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించడం గర్వంగా ఉంది. తొలిసారి నాకు మాస్ ప్రేక్షకుల నుంచి గుర్తింపు లభించింది. ఎంతో మంది అభిమానుల ఆదరణను పొందాను. అందుకే ఇస్టార్ట్ శంకర్ సినిమాకు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి అదే ఫీలింగ్ ఉంది అని నిధి అగర్వాల్ అన్నారు.

పూరీ నా ఫేవరేట్ డైరెక్టర్

పూరీ నా ఫేవరేట్ డైరెక్టర్


ఇస్మార్ట్ శంకర్‌తో ఎన్నో అనుభూతులు ఉన్నాయి. నాకు ఇష్టమైన దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పనిచేయడం చాలా హ్యపీగా ఉంది. వ్యక్తిగతంగాను, దర్శకుడిగాను ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయనతో పనిచేయడం చాలా సులభం. ఆ సినిమాతో ఎన్నో ఎమోషన్స్ నాకు ముడిపడి ఉన్నాయి. ఒక మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చి నాకంటే గుర్తింపును ఇచ్చిన దర్శకుడు, సినిమాను ఎలా మరిచిపోతాం అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

Recommended Video

Nidhhi Agerwal పై హద్దుల్లేని అభిమానం.. ఆమె రియాక్షన్ ఇదే !
 నిధి అగర్వాల్ సినీ కెరీర్

నిధి అగర్వాల్ సినీ కెరీర్


నిధి అగర్వాల్ కెరీర్ వివరాల్లోకి వెళితే.. మున్నా మైఖేల్ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి సవ్యసాచిలో నటించడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హరి హర వీర మల్లు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

75 కోట్ల వసూళ్లతో ఇస్మార్ట్ శంకర్

75 కోట్ల వసూళ్లతో ఇస్మార్ట్ శంకర్


ఇస్మార్ట్ శంకర్ సినిమా విషయానికి వస్తే.. సుమారు 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే తొలి రోజు నుంచే మంచి టాక్ సంపాదించుకోవడంతో ఓవరాల్‌గా 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పూరి కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. 2019 జూలై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X