లవ్ యూ పూరి జగన్నాథ్ అనేసిన నిధి అగర్వాల్.. ఫోటో షేర్ చేసి దిమాక్ ఖరాబ్ చేసేసింది!
అందాల భామ నిధి అగర్వాల్ తాజాగా లవ్ యూ పూరి జగన్నాథ్ అంటూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. పూరి జగన్నాథ్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ దిమాక్ ఖరాబ్ చేసే ఫోటో షేర్ చేసింది నిధి అగర్వాల్. పైగా 'లవ్ యూ' అనేయడంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
నిధి అగర్వాల్ చేసిన ఈ ట్వీట్ చూసి మురిసిపోతున్నారు పూరి అభిమానులు. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై నిధి అగర్వాల్ ఇంత ప్రేమ కురిపిస్తుండటం ఆనందించదగిన విషయం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లో టర్నింగ్ పాయింట్ తీసుకుంది నిధి అగర్వాల్. ఈ సినిమాలో అమ్మడి అందాలు తెలుగు ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేశాయి.

రామ్ మాస్ పర్‌ఫార్‌మెన్స్, హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్ అందాలు, పూరి జగన్నాథ్ టేకింగ్ అన్నీ కూడానా హైలైట్ గా ఉండటంతో ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఈ సినిమా విజయంతో ఖుషీ అయ్యారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. తన తదుపరి సినిమాను టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో చేసేందుకు రెడీ అయ్యారు పూరి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సెట్స్ పైకి రానుంది.


Click it and Unblock the Notifications











