విధి రాత అంటూ హాట్ లుక్, హైలైట్ కామెంట్.. నిధి అగర్వాల్
ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అందాలతో మాయ చేసి టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారింది నిధి అగర్వాల్. గతంలో ''సవ్యసాచి, మిస్టర్ మజ్ను'' సినిమాల్లో వరుసగా అక్కినేని అన్నదమ్ముళ్లతో రొమాన్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ సక్సెస్ జోష్‌లో మునిగి తేలుతున్న నిధి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది.
ట్విట్టర్ వేదికగా తన హాట్ హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ నెట్టింట భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన హాట్ లుక్ ఒకటి పోస్ట్ చేసిన నిధి.. దానిపై అదరగొట్టే ట్యాగ్ లైన్ ఇచ్చింది. ''విధి రాతను నేను నమ్మను.. గెలుపొందడం, గమ్యం చేరుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది'' అంటూ ఆదర్శవంతమైన కామెంట్ చేసింది. దీంతో ఈ కామెంట్, నిధి హాట్ హాట్ లుక్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఇస్మార్ట్ శంకర్ విజయాన్ని పూరి జగన్నాథ్, ఛార్మిలతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది నిధి అగర్వాల్. ఫుల్ జోష్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి అభిమానులకు అందాల విందు చేసిన నిధి.. విజయోత్సవ యాత్రను విజయవంతంగా ముగించింది. ప్రస్తుతం నిధి జోష్ చూస్తుంటే రానున్న రోజుల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా విషయానికొస్తే.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. ఆయన సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. రామ్ మాస్ పర్‌ఫార్‌మెన్స్‌కి తోడు నిధి, నభా అందాలు ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా వారికి కాసుల పంట పండించింది.


Click it and Unblock the Notifications











