twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎక్స్‌పోజింగ్ కాకుండా చాలా చేశాను.. చూడు నీకే తెలుస్తుంది.. నిధి అగర్వాల్

    |

    సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్ కోసం దాన్ని బాగా వాడుకుంటున్నారు హీరోహీరోయిన్లు. ఈ మేరకు హాట్ ఫొటో షూట్స్ షేర్ చేయడం, వ్యక్తిగత విషయాలను పంచుకోవడం లాంటి వాటితో పాటు నెటిజన్లతో లైవ్ చాట్స్‌లో పాల్గొంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో హీరోయిన్లు పెట్టే సోషల్ మీడియా పోస్టులకు నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యే ప్రమాదముంది. ఆ సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించాలి. లేదంటే పలు వివాదాలకు దారి తీసే ప్రమాదముందుటుంది. సరిగ్గా ఇలాంటి సందర్భమే ఎదురైంది 'ఇస్మార్ట్ శంకర్' భామ నిధి అగర్వాల్‌కి.

    ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్‌లో భాగంగా నిధి అగర్వాల్

    ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్‌లో భాగంగా నిధి అగర్వాల్

    ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది నిధి అగర్వాల్. ఆమె చేసిన గత రెండు సినిమాలు ఆశించిన మేర ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సినిమాతో తనకు ఖచ్చితంగా బ్రేక్ వస్తుందని నమ్మకంగా ఉంది నిధి. జులై 18 న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది నిధి అగర్వాల్.

    నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న

    నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న

    ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్ కాస్త హాట్ గానే కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, లిరికల్ సాంగ్స్ ఈ సినిమాలో నిధి అందాల డోస్ దిమాక్ ఖరాబ్ చేయడం ఖాయం అని చెప్పేశాయి. అయితే ఈ కోణంలోనే నిధి అగర్వాల్‌కి ఓ నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఎక్స్‌పోజింగ్ ఒక్కటే చేశావా.. లేక ఇంకేమైనా చేశావా? అంటూ వెటకారంగా కామెంట్ చేశాడు నెటిజన్.

    చాలా చేశాను.. చూడు నీకే తెలుస్తుంది అంటూ నిధి

    అయితే నెటిజన్ అడిగిన ఆ ప్రశ్నపై నిధి ఆశ్చర్యకరంగా రియాక్ట్ అయింది. ''చాలా చేశాను.. ట్రైలర్‌ కాదు, మూవీ చూడు'' అంటూ నెమ్మదిగానే చురకలంటించింది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నిధి చెప్పిన ఈ సమాధానం, ఆమె పాటించిన సంయమనం చూసి వావ్ అంటున్నారు అంతా.

    ఇస్మార్ట్ శంకర్ మూవీ

    ఇస్మార్ట్ శంకర్ మూవీ

    పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్ మార్క్‌లో రూపొందించి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా. పూరి, ఛార్మి కలిసి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయనతో చిందులేశారు. జులై 18వ తేదీ నుంచి పూరి స్టైల్‌లో ఈ ముగ్గురి రొమాన్స్ చూడనున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

    English summary
    Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's high voltege action seens will seen in this movie. This movie trailer creating sensetion in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X