అందాలు ఆరబోయడమే అనుకున్నాం గానీ.. హాట్ బ్యూటీ నిధిలో ఈ లక్షణాలు కూడానా?
ఈ రోజుల్లో సాధారణంగా ఓ హీరోయిన్ తన లోని గ్లామర్ ఒలకబోయడం కామనే. యంగ్ హీరోయిన్లకు సోషల్ మీడియా గుర్తొస్తే చాలు తమ హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తున్న రోజులివి. ఇదంతా కేవలం దర్శకనిర్మాతలు, ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసమే అనేది ఓపెన్ సీక్రెట్. అయితే అందుకు భిన్నంగా ఆలోచించింది యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్. అందాలు ఆరబోయడమే కాదు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కూడా పడేయొచ్చు అని తెలిపేలా తాజాగా ఓ పిక్ షేర్ చేసింది.
అతను అలా అనగానే..
ఎప్పుడైతే అతను నువ్ క్యూట్ గా ఉన్నావ్ అంటాడో..! అనే క్యాప్షన్ తో అదిరిపోయే తన లుక్ పోస్ట్ చేసింది నిధి. ఈ లుక్‌లో సిగ్గు పడుతున్నట్లు గానే కనిపిస్తూ యమ హాట్‌గా కవ్విస్తోంది నిధి అగర్వాల్. అంటే కేవలం గ్లామర్ తోనే కాదు ఎక్స్‌ప్రెషన్స్‌తో కూడా పడేయడం నా స్టైల్ అని చెప్పేసిందీ హాట్ బ్యూటీ.

ఇంతకీ అతనెవరు..?
మరోవైపు నిధి అగర్వాల్ పెట్టిన క్యాప్షన్ చూసి నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరతను? లవ్ లో ఉన్నావా ఏంటి? బేబీ ఇది ఎండాకాలం.. ప్లీజ్ ఇంకా వేడి పుట్టించొద్దు అని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. నిధి పెట్టిన ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో అలా.. ఇప్పుడిలా
గతంలో ఇదే సోషల్ మీడియా వేదికగా తన మనసులోని మాటను బయటపెట్టింది నిధి అగర్వాల్. మీ అందరికీ ముద్దు పెట్టాలనుందని పేర్కొంటూ.. గులాబీ రంగు టాప్, రంగు రంగుల మిడ్డీతో కిస్ చేస్తున్న పిక్ షేర్ చేసింది. ఈ రకంగా మీ అందరికీ ముద్దులివ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ఈ పోస్ట్, తాజా పోస్ట్ బట్టి చూస్తే జోడు కోసం నిధి తహతహలాడుతోందని తెలుస్తోంది.

నిధి దిమాక్ ఖరాబ్
ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో నిధి తన అందాలను ఆరబోస్తోంది. ఈ సినిమా నుంచి దిమాక్ ఖరాబ్ అనే స్పెషల్ సాంగ్‌లో నిధి అగర్వాల్ గెటప్ బయటకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలంగాణ యాసలో సాగనున్న ఈ సాంగ్‌లో నిధి సొగసులు, మణిశర్మ బాణీలు థియేటర్లను హోరెత్తించనున్నాయి.

జులై 12వ తేదీన
టాలీవుడ్‌లో అక్కినేని అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్ లతో రొమాన్స్ చేసి ఆకట్టుకున్న నిధి అగర్వాల్.. ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో చిందులేస్తూ ఇలా తరచుగా సోషల్ మీడియా ద్వారా తన సరదాలు తీర్చుకుంటోంది నిధి. జులై 12వ తేదీన ఇస్మార్ట్ శంకర్ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











