పెళ్లికి సిద్దమైన పవన్ కల్యాణ్ హీరోయిన్.. కాబోయే భర్త ఎవరంటే? వివాహం ఎప్పుడంటే?
తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన హీరోయిన్, ప్రియాంక చోప్రా సోదరి మీరా చోప్రా పెళ్లికి సిద్దమవుతున్నది. ఇప్పటి వరకు తన ప్రియుడితో డేటింగ్ చేస్తున్న ఈ అందాల భామ త్వరలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నది. ప్రస్తుతం మీరా చోప్రా పెళ్లి వార్త మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఇంతకు ఈ భామ పెళ్లి తేదీ ఎప్పుడు? ఆమె ప్రియుడు ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..
మీరా చోప్రా హీరోయిన్‌గా తమిళ సినిమా రంగం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అంబే ఆరుయైర్ సినిమా ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి బంగారం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నది. అనంతరం అర్జున్ సినిమా ద్వారా కన్నడలోకి ప్రవేశించింది.
నకిలీ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌తో వసూళ్ల దందా.. నెటిజన్‌పై స్టార్ హీరోయిన్ కేసు నమోదు!

తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో ఆఫర్లు తగ్గిపోవడంతో మీరా చోప్రా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. గ్యాంగ్స్ ఆఫ్ ఘెస్ట్ సినిమా ద్వారా హిందీలోకి అడుగుపెట్టింది. ఇటీవల వన్ అనే సినిమా ద్వారా ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించింది. తాజాగా ఆమె నటించిన చిత్రాలు సెక్షన్ 375, సేప్ట్ చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
అయితే మీరా చోప్రా గత కొద్దికాలంగా తన స్నేహితుడితో ప్రేమలో పడింది. కొద్ది నెలలుగా ఆమె అతడితో డేటింగ్ చేస్తున్నది. అయితే తన ప్రియుడి పేరును ఐడెంటిని సీక్రెట్‌గా పెట్టింది. అయితే ఇప్పటికీ తాను ఎవరితో డేటింగ్ చేస్తున్న విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. అయితే ఇటీవల రెండు కుటుంబాలు తన ప్రేమకు అంగీకారం తెలపడంతో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మీరా చోప్రా పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిపించేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఆమె సన్నిహితులు తెలిపిన ప్రకారం.. జైపూర్‌లోని రాయల్ సిటీ ప్యాలెస్‌లో వివాహానికి ముహుర్తం జరుగనున్నది. మార్చి 11, 12 తేదీల్లో తన చిరకాలపు స్నేహితుడు, ప్రియుడి చేతిలో మూడుమూళ్లు వేయించుకోవడానికి రెడీ అవుతున్నారు.
నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా ప్రేమ వివాహం తర్వాత.. ఆమె కజిన్స్ పరిణితి చోప్రా, మీరా చోప్రా కూడా ఆమె దారిలోనే నడించేందుకు సిద్దమయ్యారు. ఇటీవల ఆప్ పార్టీ ఎంపీతో పరిణితి చోప్రా వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇక మీరా చోప్రా కూడా అదే దారిలో నడుస్తూ ప్రేమ వివాహానికి రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











