బికినీలో కరీనా కపూర్‌లా చూపిస్తామంటూ.. వివాదంపై నోరు విప్పిన ప్రియమణి

దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి ప్రియమణి (Priyamani). ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస అవకాశాలతో బిజీగా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తన ప్రతిభను నిరూపించుకున్న ఈ నటి, తాజాగా బికినీ వివాదంపై చేసిన వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా గతంలో తాను నటించిన 'ద్రోణ' సినిమా సమయంలో జరిగిన సంఘటనలను ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించడంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఇంతకీ ఏమన్నారు? అసలేం జరిగింది?

సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కాలానుగుణంగా మారుతున్నాయి. ఒకప్పుడు గ్లామర్ సన్నివేశాలు పెద్ద సంచలనంగా ఉండేవి. కానీ ఇప్పుడు రొమాంటిక్ సీన్లు, బికినీ సన్నివేశాలు సాధారణంగా మారిపోయాయి. అయితే అప్పట్లో బికినీ అంటే పెద్ద రిస్క్‌గా భావించేవారు. అలాంటి పరిస్థితుల్లోనే ప్రియమణి 'ద్రోణ' సినిమాలో బికినీ సీన్ చేయడం విశేషంగా నిలిచింది. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Priyamani Opens Up on Drona movie Bikini Controversy Says Director Compared Her to Kareena

ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను తాజాగా ప్రియమణి వివరించారు. కథ చెప్పినప్పుడు బికినీ సన్నివేశం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, షూటింగ్ ప్రారంభమైన తర్వాతే ఆ సీన్ గురించి చెప్పారని వెల్లడించారు. మొదట ఈ విషయం విని తాను షాక్ అయ్యానని, ఎందుకంటే అప్పటివరకు ఎప్పుడూ అలాంటి గ్లామర్ లుక్‌లో కనిపించలేదని చెప్పారు. అయితే దర్శకుడు తనను ఒప్పించే ప్రయత్నం చేశాడని, కథకు ఆ సన్నివేశం అవసరమని వివరించడంతో చివరికి అంగీకరించినట్లు గతంలో పలు మార్లు తెలిపారు.

ఆ యాంకర్‌తో సుడిగాలి సుధీర్ డేటింగ్ ? సీక్రెట్ రిలేషన్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా!
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ బికినీ వివాదంపై ప్రియమణి తన అభిప్రాయాన్ని మరోసారి వెల్లడించారు. 'బికినీ ధరించడం తప్పుకాదు. కథ, పరిస్థితులకు అనుగుణంగా దుస్తులు వేసుకోవాల్సిందే. స్విమ్మింగ్ పూల్ సీన్ ఉంటే చీర వేసుకోలేం కదా' అని అన్నారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ (Kareena Kapoor) 'టషన్' సినిమాలో బికినీ లుక్‌తో వైరల్ అయిన తర్వాత, తనను కూడా అదే విధంగా డిఫరెంట్‌గా చూపించాలని దర్శకుడు చెప్పాడని ప్రియమణి వెల్లడించారు. దీంతో ఒక కొత్తగా ట్రై చేయాలనే ఆలోచనతో తాను బికినీ సీన్‌కు ఓకే చెప్పానని పేర్కొన్నారు. అయితే ఆ సీన్ విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రియమణి తెలిపారు.

'అప్పటివరకు నేను చేసిన పాత్రలు చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కసారిగా గ్లామర్ లుక్‌లో కనిపించడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. దాంతో నా మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది'అని ఆమె చెప్పారు. ముఖ్యంగా 'డబ్బుల కోసం బికినీ వేసింది' అనే వార్తలు కూడా ప్రచారం అయ్యాయని, కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

అయితే అదే సమయంలో నటిగా తన కంఫర్ట్ కూడా చాలా ముఖ్యం అని, ఇప్పుడు అయితే అలాంటి సన్నివేశాలు చేయనని స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ప్రియమణి నటించిన విజయ్ 'జన నాయగన్ ' రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే అది కోర్టు కేసులు, సెన్సార్ వివాదంతో వాయిదా పడుతోంది. అంతే కాకుండా జీడీఎస్, గోల్మాల్ సినిమాల్లో ప్రియమణి నటిస్తోంది. ప్రస్తుతం ప్రియమణి వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

Read more about: kareena kapoor priyamani nithin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X