It's official: ఎన్సీబీ సమన్లతో రకుల్ ప్రీత్ కు ‘డ్రగ్స్’ దెబ్బ..రియా చక్రవర్తితో ఇరుక్కుపోయింది అలా

బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ దర్యాప్తులో దక్షిణాది అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం సంచలనం రేపింది. రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు జరిపిన లోతైన విచారణలో రకుల్, సారా ఆలీ ఖాన్ పేర్లు బయటకు రావడం సినీ పరిశ్రమలను కదిపేసింది.

అయితే తనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని ఫిర్యాదు చేస్తూ ఢిల్లీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ సప్లయర్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఎన్సీబీ అధికారికంగా సమన్లు జారీ చేయడంతో మరోసారి సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ కేసులో రకుల్ ఎలా ఇరుక్కుపోయారంటే..

రకుల్ ప్రీత్ సింగ్, దీపిక, సారా, శ్రద్దాలకు నోటీసులు.. 24న విచారణకు ఎన్సీబీ ఆదేశాలు

రియా చక్రవర్తితో సన్నిహితంగా

రియా చక్రవర్తితో సన్నిహితంగా

డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ మంచి స్నేహితులు. వారిద్దరూ ముంబైలో ఒకే జిమ్‌లో వర్కవుట్లు చేస్తారు. కామన్ ఫ్రెండ్స్ పార్టీల్లో కలిసి పాల్గొన్న దాఖలాలు ఉన్నాయి. అయితే రియా చక్రవర్తికి టాలెంట్ మేనేజర్ జయ సాహా మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్ లీక్ కావడంతో రకుల్ ప్రీత్‌కు ఉన్న సంబంధాలు బయటకు వచ్చాయి.

జయ సహా విచారణలో అనూహ్యంగా పేర్లు తెరపైకి

జయ సహా విచారణలో అనూహ్యంగా పేర్లు తెరపైకి

రియా, సుశాంత్ మేనేజర్ జయ సాహా వాట్సప్ ఛాటింగ్‌పై దృష్టిపెట్టడంతో రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్, శ్రద్దా కపూర్, దీపిక పదుకోన్ పేర్లు అనూహ్యంగా పైకి వచ్చాయి. అయితే తన పేరు ఎన్సీబీ విచారణలో బయటపడటంతో రకుల్ ప్రీత్ ఆందోళనకు లోనయ్యారు. ఆ క్రమంలో లీగల్ నిపుణులతో చర్చలు జరిపారు.

కోర్టు ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్

కోర్టు ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్

రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడంతో మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. తనకు, డ్రగ్స్ సంబంధాలపై వస్తున్న మీడియా కథనాలపై నియంత్రించేలా ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మీడియా చట్టాలకు లోబడి కథనాలు ప్రసారం, ప్రచురించాలని పేర్కొన్నారు. అధికారికంగా ఏదైనా వస్తే వార్త కథనాలపై స్పందించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
సెప్టెంబర్ 24న విచారణకు రకుల్ ప్రీత్ సింగ్

సెప్టెంబర్ 24న విచారణకు రకుల్ ప్రీత్ సింగ్

గత కొద్దికాలంగా మీడియాలో చేలరేగిన ఊహగానాలకు అనుగుణంగా రకుల్ ప్రీత్ సింగ్‌కు నార్కోటిక్స్ అధికారులు సమన్లు జారీ చేశారు. జారీ చేసిన సమన్ల ప్రకారం.. రకుల్ ప్రీత్ సింగ్‌, సైమన్ కంబాట్టాను సెప్టెంబర్ 24న విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ షూటింగులో ఉన్న రకుల్ ప్రీత్ ముంబైకి చేరుకొనేందుకు ప్లాన్ చేసుకొన్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X