పూరీ జగన్నాథ్‌కు రమ్యకృష్ణ ఆఫర్.. ‘బాహుబలి’ తర్వాత ఆమె ఇలా ఎప్పుడూ చేయలేదు.!

By Manoj Kumar P

తెలుగు తెరపై ఎంతో మంది గుర్తింపు పొందిన నటీమణులు ఉన్నారు. వారిలో కొందరు మాత్రమే ఇప్పటికీ ప్రభావం చూపిస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒకరు. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న ఈమె.. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. ఈమె ఒక్క తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో కూడా నటించి మెప్పించారు. ఇక, కొన్నేళ్ల క్రితం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇప్పుడు కూడా ఆమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా వార్త.? వివరాల్లోకి వెళితే...

సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీ

సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీ

గతంలో హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ.. వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. కానీ, కొన్నేళ్ల క్రితం ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. సిద్దార్ద్ - తమన్నా జంటగా నటించిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమా ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే సపోర్టింగ్ రోల్స్‌తో ఆమె బిజీ బిజీగా గడుపుతున్నారు.

అదే ఆమెకు ప్లస్ అయింది

అదే ఆమెకు ప్లస్ అయింది

రమ్యకృష్ణ గతంలో హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల్లో అత్యుత్తమ నటనను కనబరిచారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా మంచి ప్రదర్శననే ఇస్తున్నారు. అయితే, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'లో ఆమె చేసిన శివగామి పాత్ర మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతోంది. ఇదే రమ్యకృష్ణ కెరీర్‌కు బాగా ప్లస్ అయిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దర్శకుడి కొడుకు ప్రేమకు ఫిదా

దర్శకుడి కొడుకు ప్రేమకు ఫిదా

ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటిస్తున్న ‘రొమాంటిక్' ఒకటి. అనిల్ పాదూరి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీని పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్య కీలక పాత్ర చేస్తున్నారు. హీరో, హీరోయిన్ ప్రేమను గెలిపించడంలో ఈమె పాత్ర కీలకంగా ఉంటుందని టాక్.

పూరీ జగన్నాథ్‌కు రమ్యకృష్ణ ఆఫర్

పూరీ జగన్నాథ్‌కు రమ్యకృష్ణ ఆఫర్

ఈ సినిమా కోసం రమ్యకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారని తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘బాహుబలి' తర్వాత ఆమె రోజుకు 10 - 15 లక్షలు చార్జ్ చేసేవారట. అయితే, ఈ సినిమాకు మాత్రం అలా కాకుండా రూ. 50 లక్షలు లోపు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆమె మొత్తంగా 17 - 20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారని సమాచారం.

ఆ ఇద్దరు హీరోల మూవీల్లో కూడా

ఆ ఇద్దరు హీరోల మూవీల్లో కూడా

ప్రస్తుతం రమ్య.. కృష్ణ వంశీ తీస్తున్న ‘రంగమార్తాండ'లో నటిస్తున్నారు. అలాగే, పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న ‘ఫైటర్'లో రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో మాత్రమే కాదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా ప్రాజెక్టులో సైతం రమ్య అవకాశం దక్కించుకున్నారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X