ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అంటున్న రష్మిక, కానీ,

సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం సినిమా రంగంలో అత్యంత డిమాండ్‌ ఉన్న నటీమణులలో ఒకరు. స్టార్ హీరోలతో కలిసి భారీ బడ్జెట్‌ కమర్షియల్ సినిమాలు చేస్తూనే, అప్పుడప్పుడూ లేడీ ఓరియెంటెడ్ కథల ద్వారా తన నటనను మరో స్థాయికి తీసుకెళ్తోంది. రొమాంటిక్ పాత్రల్లోనైనా, ఎమోషనల్ సీన్స్‌లోనైనా తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ సాధించింది రష్మిక, ప్రస్తుతం దక్షిణాది మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా తన మార్క్‌ సృష్టిస్తోంది. తాజాగా ఐటమ్‌ సాంగ్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?

పాన్ ఇండియా క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) తాజాగా టాలీవుడ్ హీరో జగపతి బాబు హోస్ట్‌ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' షోలో పాల్గొని తన కెరీర్‌ ప్రయాణం, వ్యక్తిగత విషయాలపై ఓపెన్‌గా మాట్లాడింది. ప్రస్తుతం సినీ రంగంలో వరుస విజయాలతో టాప్‌ లీగ్‌లో ఉన్న రష్మిక, ఇప్పుడు కొత్త రకాల పాత్రలు చేయాలనే ఆసక్తి వ్యక్తం చేసింది. "నా కెరీర్‌లో ఇప్పటి వరకు చాలా లవ్‌, ఫ్యామిలీ డ్రామాలు చేశాను. ఇకపై నెగెటివ్ రోల్స్‌ కూడా చేయాలనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటే విలన్‌ క్యారెక్టర్‌ కూడా చేస్తాను," అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Rashmika Mandanna Opens Up Ready for Item Songs But Only for Four Top Directors

జగపతి బాబు "ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తావా?" అని అడగగా, రష్మిక చిరునవ్వుతో "అవును, చేస్తా.. కానీ, అందరికీ కాదు. నా మనసులో నలుగురు దర్శకులు ఉన్నారు. వాళ్లు అడిగితేనే స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తాను. వాళ్లే నన్ను ఆ పాత్రకు సరిగ్గా తీర్చిదిద్దగలరని నమ్మకం ఉంది. వాళ్ల తప్ప మరెవరైనా అడిగితే చేయను " అని చెప్పి ఆసక్తిని రేపింది. అయితే, ఆ నలుగురు డైరెక్టర్స్‌ పేర్లు మాత్రం వెల్లడించకుండా సీక్రెట్‌గా ఉంచింది. తన నటనలో వైవిధ్యాన్ని చూపాలనే తపనతో ఉన్న రష్మిక, "ఒక ఆర్టిస్టుగా ఎప్పుడూ కొత్త సవాళ్ల కోసం ఎదురుచూస్తుంటాను. ఆడియన్స్‌కి విభిన్నమైన పాత్రలు చూపించడం నాకు ఇష్టం. సెంటిమెంట్‌, ఎమోషన్‌, రొమాన్స్‌ అన్నీ చేశాను. ఇక ఇప్పుడు నెగెటివ్‌ షేడ్స్‌లోనూ నన్ను నేను చూడాలనుకుంటున్నాను" అని చెప్పింది.

ప్రస్తుతం రష్మిక దేశవ్యాప్తంగా అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. ఒక్కో సినిమాకు రూ. 5 నుండి రూ. 6 కోట్లు వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుందనే సమాచారం. ఇటీవల విడుదలైన 'గర్ల్‌ఫ్రెండ్' కోసం మాత్రమే రూ.3 కోట్లు తీసుకుందని తెలుస్తుంది. కథ బాగా నచ్చడంతో పాటు సినిమాతో రష్మిక సంతృప్తిగా ఉందని అందుకే ఆమె తక్కువ రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తుంది. 2025లో ఇప్పటికే ఐదు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు, అందులో నాలుగు హిట్స్‌ సాధించింది. టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ దాకా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు కోట్లాది అభిమాన వర్గం సంపాదించుకుంది.

ఆ ఇంజెక్షన్స్ వాడుతున్నారా? .. బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై తమన్నా క్లారిటీ!
ఇటీవల థామా అనే రొమాంటిక్ కామెడీ హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాగే తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంట్ మూవీతో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను వసూలు చేస్తుంది. అలాగే, 'రైన్‌బో', 'సిక్రెట్ రివల్యూషన్' వంటి సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక, రాబోయే నెలల్లో పలు హిందీ ప్రాజెక్టుల్లో నటించనుంది. ఇకపోతే.. ఆమె చెప్పిన ఆ నలుగురు దర్శకులు ఎవరో తెలుసుకోవడానికి అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నలుగురు డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా? తెలిస్తే.. వారి పేర్లను కామెంట్ బాక్స్ లో రాయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X