‘నా భర్తకు 50 మందితో అఫైర్.. అయినా వదిలిపెట్టను’
బాలీవుడ్ అగ్రనటుడు గోవిందా భార్య సునీత అహుజా గత కొద్దిరోజులుగా తమ వైవాహిక బంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న లాకప్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సునీత.. తన భర్త గోవింద గురించి ఒక్కో సీక్రెట్ రివీల్ చేస్తూ షాకులు ఇస్తున్నారు. తాజాగా మరోసారి ఆమె బాంబు పేల్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
లాకప్: సచ్ యా సజా షో హాట్ హాట్‌గా సాగుతోంది. ఇందులో కంటెస్టెంట్స్‌గా వచ్చిన వారు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని సీక్రెట్స్‌ను రివీల్ చేయాల్సిందిగా డిఫరెంట్ టాస్క్‌లు ఇస్తున్నారు నిర్వాహకులు. ఈ సీజన్‌లో సునీత అహుజా, బుల్లితెర నటి ఆకాంక్ష చమోలీలు వైరల్ కామెంట్స్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. భర్తతో విడాకులతో పాటు తాను బై సెక్సువల్ అని అందరి ముందు నిజాయితీగా ఒప్పుకున్నారు ఆకాంక్ష. ఇక సునీత విషయానికి వస్తే.. తన భర్త గోవిందా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

పెళ్లయిన క్షణం నుంచే నా భర్త నమ్మక ద్రోహం చేయడం ప్రారంభించాడు. అతనికి చాలామందితో ఎఫైర్లు ఉన్నాయి, ఆయన హీరో కాబట్టి ఏమీ అనలేం. ఎక్కువ ఆలోచిస్తే నా డయాబెటీస్ మరింత పెరుగుతుంది. 24 గంటలూ నా భర్తను గమనిస్తూ, ఆయన ముందే ఉండలేను కదా. జరిగేది జరుగుతుంది, నా పిల్లల కోసమే నేను బతుకుతున్నాను. ఇద్దరం వేర్వేరు ఇళ్లలో ఉంటున్నామని సునీత అహుజా ఇటీవల వ్యాఖ్యానించారు.
తాజాగా లాకప్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శిల్పా షిండే రాకతో హౌస్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రావడం రావడంతోనే శివాంగి జోషి, సునీతలతో శిల్ప గొడవ పెట్టుకుంది. గోవింద ఎఫైర్స్ గురించి చెప్పమని శిల్పా ప్రశ్నించగా.. ఎవరి హద్దుల్లో వాళ్లు ఉండాలని సునీత వార్నింగ్ ఇచ్చింది. సునీత విషయంలో ఆమెను ప్రశ్నించడానికి గోవిందా అభిమానులకు ఏ హక్కు లేదు.. ఆమెను ఇతరులు తప్పుగా అర్ధం చేసుకోవడాన్ని నేను గమనించా. మీ ఆలోచన ఏమిటో వారికి తెలియాలి కదా అని శిల్పా తొలుత వ్యాఖ్యానించింది.
దానికి సునీత స్పందిస్తూ.. నేను నిజాలు చెబితే జనాలు తట్టుకోలేకపోతున్నారు. నా స్థానంలో నిలబడి ఆలోచించి, ఆ తర్వాత నన్ను అంచనా వేయాలి. నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు.. ఇది నా జీవితం, నా నియమాలు, నా భర్త, నా ఇష్టం. అతనిని మందలించే హక్కు నాకుంది, ఆయన పదిచోట్ల నన్ను మోసం చేసినా సరే, నేను అతనిని వదిలిపెట్టను. చనిపోయేంత వరకు ఆయనను ప్రేమిస్తూనే ఉంటానని సునీత తేల్చేశారు.
ఈ వివాదం అక్కడితో ముగిసిపోయాక తోటి కంటెస్టెంట్ రామ్ కపూర్‌తో సునీత మాట్లాడుతూ.. అతను ఏం చేసినా సరే అది అతని ఇష్టం. ఈ విషయం గురించి మాట్లాడే హక్కు ఇంకెవరికీ లేదు. నేను ఆయన భార్యను, మమ్మల్ని రెచ్చగొట్టడానికే శిల్పాను లోపలికి పంపారు. ఆమె కనుక హద్దులు దాటితే మాత్రం నా చేతిలో తన్నులు తినక తప్పదు. నా కుటుంబం గురించి మాట్లాడొద్దు, ఆయన నా భర్త. ఒకవేళ గోవిందా 50 మందితో సంబంధాలు పెట్టుకున్నా సరే.. దాని వల్ల శిల్పాకు వచ్చిన నష్టమేంటీ? అని సునీత కుండబద్ధలు కొట్టింది. ప్రస్తుతం సునీత అహుజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వైవాహిక బంధానికి, భర్తకు సునీత ఇచ్చే విలువ, ఆమె నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications



