నా హృదయం బద్దలైంది.. సమంత ఎమోషనల్ పోస్ట్
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు వరుస హిట్ అందుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీలోని పలువురు అగ్ర హీరోల సరసన లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది. తన అందం, అభినయంలో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో సెటిల్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంత తన బాధను, ఆవేదనను బయట పెడుతూ ఓ ఎమోషనల్ పోస్టు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఇటీవల కేరళలో ర్యాగింగ్ భూతానికి ఓ బాలుడు బలైన సంగతి తెలిసిందే. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన మిహిర్(15) అనే బాలుడు.. తన తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనవరి 15న చోటు చేసుకోకగా.. తమ కుమారుడు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ ఆ విద్యార్థి తల్లి ఇటీవల పలు విషయాలను వెల్లడిస్తూ సోషల్‌మీడియాలో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ ఘటన బయట ప్రపంచానికి తెలిసింది. ఈ అమానవీయ ఘటనపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ సమంత(Samantha) స్పందిచింది. మిహిర్ ఆత్మహత్య గురించి తెలిసి షాకయ్యానని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. "#JusticeForMihir" అని రాస్తూ ఆ టీనేజ్ తల్లి రాసిన నోట్‌ను సమంత పోస్ట్ చేసింది. హీరోయిన్ సమంత ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. ' ఈ వార్త విని నా హృదయం బద్దలైంది. మనం 2025లో ఉన్నాం. కొంత మంది స్వార్థం, ద్వేషపూరితమైన తోటి విద్యార్థుల వల్ల ఓ మంచి విద్యార్థిని పోగొట్టుకున్నాం.. బెదిరింపు, వేధింపులు,ర్యాగింగ్ అనేది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోంది ఈ ఘటన చెబుతుంది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Marco OTT: ఓటీటీలోకి మార్కో మూవీ.. మోస్ట్ వయెలెంట్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సమంత ఇంకా కంటిన్యూ చేస్తూ.. ' ఇలాంటి అనార్థాల వల్ల మనిషి మానసికంగా, భావోద్వేగంగా, కొన్నిసార్లు శారీరకంగా కుంగిపోతాడు. మన దేశంలో ర్యాగింగ్ కు వ్యతిరేకంగా కఠిన చట్టాలు ఉన్నప్పటికి.. కొంతమంది విద్యార్థులు మౌనంగా బాధపడుతూనే ఉన్నారు. మాట్లాడటానికి భయపడతారు. కొందరు బయటకు చెప్పుకోలేరు. మరికొందరూ లోలోపల బాధపడుతున్నారు. మ నం ఈ విషయంలో చాలా నీచానికి దిగజారుతున్నాం. ' ఎమోషనల్ అయ్యారు

'ఇలాంటి ఘటనలను కేవలం సంతాపంతో సరిపెట్టలేం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. న్యాయం కోసం అంతా డిమాండ్ చేయాలి. అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. మిహిర్‌కు న్యాయం జరగాలి. ఈ విషయంలో వారిని న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఎక్కడైనా అన్యాయం జరుగుతుందో నోరు విప్పితేనే న్యాయం దొరుకుతుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి, ప్రతీ ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. అలాగే పిల్లలకు జాలి, దయ, కరుణ, ప్రేమ వంటివాటిని నేర్పించాలి ' అంటూ సమంత ఎమోషనల్ పోస్టు చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సమంత డిమాండ్ చేసింది.


Click it and Unblock the Notifications











