Samantha: మరో బడా మూవీలో సమంత స్పెషల్ సాంగ్.. ఊ అంటావాకు మించిన ట్రీట్‌కు రెడీ
చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. 'ఏమాయ చేశావే' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అందరినీ మాయ చేసేసింది. తద్వారా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది. దీంతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సైతం సొంతం చేసుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే 'పుష్ప' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో యమ జోష్ మీదున్న సమంత.. ఇప్పుడు మరో సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఇక్కడా.. అక్కడా హవా చూపిస్తోంది
ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో దాదాపు దశాబ్ద కాలంగా ప్రేక్షకులను మైమరపించిన సమంత.. టాలీవుడ్‌లోని అందరు హీరోలతోనూ ఆడిపాడింది. దీంతో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తోంది. ఇక్కడ మాత్రమే కాదు.. కోలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ హవాను చూపిస్తోంది. దీంతో రెండు ఇండస్ట్రీల్లోనూ వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతూ స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూనే ఉంది.

సినిమాలే కాదు.. అందులోనూ టాప్
చాలా కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. ఆహా సంస్థ కోసం ‘సామ్ జామ్' షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇది సమంత రేంజ్‌ను నేషనల్ లెవెల్‌కు తీసుకుని వెళ్లిందని చెప్పొచ్చు.

పాన్ ఇండియా మూవీలో సమంత
సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం' అనే పాన్ ఇండియా ఫిల్మ్‌లో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు హీరోగా నటిస్తుండగా.. అల్లు అర్హ కూడా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని పనులూ పూర్తి చేసేసింది సామ్.

ఇంటర్నేషనల్ మూవీ... యశోదగా
కెరీర్ ఆరంభం నుంచి దక్షిణాది సినిమాలకే పరిమితమైన సమంత.. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌లోనే నటించనుంది. ఈ విషయాన్ని సామ్ తాజాగా ప్రకటించింది. BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ ‘The arrangements of love' నవల ఆధారంగా రూపొందబోతుంది. అలాగే, ‘యశోద' అనే పాన్ ఇండియా చిత్రంలోనూ నటిస్తోంది.

ఐటెం సాంగ్‌తో రచ్చ చేసిన సామ్
స్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప' మూవీలో ఊ అంటావా అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇందులో ఆమె అందాల విందు చేసింది. ఈ పాటకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. దీంతో ఎన్నో రికార్డులు సైతం బద్దలయ్యాయి.

మరోసారి స్పెషల్ సాంగ్‌కు సిద్ధం
సుదీర్ఘమైన కెరీర్‌లో ‘ఊ అంటావా' అనే స్పెషల్ సాంగ్‌తో దేశం మొత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. దీంతో ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘లైగర్' మూవీలోనూ సమంత స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఇప్పుడీ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.
Recommended Video

ఊ అంటావాకు మించిన ట్రీట్‌తో
పూరీ జగన్నాథ్ ప్రతి సినిమాలోనూ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఇదే పంథాను కొనసాగిస్తూ ‘లైగర్' మూవీలోనూ అదిరిపోయే పాటను పెట్టబోతున్నారట. దీనికోసం సమంతనే తీసుకోబోతున్నారని అంటున్నారు. ఇందులో ‘ఊ అంటావా' కంటే ఎక్కువ గ్లామర్ ట్రీట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సినీ ప్రియులకు పండగే అని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











