సమంత బేబీ బంప్ ఫోటో ట్రెండింగ్.. ఆ మాటతో అందరి మనసు దోచేసిందిగా!

Samantha Baby Bump: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా 'మా ఇంటి బంగారం'సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అద్బుత విజయాన్ని అందుకుంది. నయా రికార్డులను కూడా క్రియేట్ చేస్తోంది.ఈ సినిమా సక్సెస్ మీట్ లో సమంత తాను గర్భవతినని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఈ సినిమా తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుని మ్యాటర్నిటీ లీవ్‌లోకి వెళ్తానని వెల్లడించారు. తన బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ అభిమానుల కోసం కొత్త సినిమాతో వస్తానని కూడా హామీ ఇచ్చారు.

ప్రస్తుతం సమంత ఆ సినిమా సక్సెస్ తో పాటు తన జీవితంలో అత్యంత అందమైన దశను ఆస్వాదిస్తోంది. త్వరలోనే తల్లి కాబోతున్న సమంత.. పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. మరో క్షణంలో ట్రెండింగ్ అవుతున్నాయి. అలా ఇటీవల తాను తల్లి కాబోతున్ననని అధికారికంగా ప్రకటించిన సమంత ఇప్పుడు తొలిసారిగా బేబీ బంప్‌ను చూపిస్తూ ఓ ఫోటో నెట్టింట్లో షేర్ చేసింది. ఆ ఫోటోతో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆ ఫోటోకు జత చేసిన సరదా క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Samantha Shares her Baby Bump Picture Internet Loves Her My Six-Pack Caption

సమంత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బేబీ బంప్ స్పష్టంగా కనిపించే ఓ ఫోటోను పంచుకుంది. ఇంట్లో రిలాక్స్ అవుతూ తీసుకున్నట్లు కనిపిస్తున్న ఈ ఫోటోలో ఆమె బ్లాక్ డ్రెస్‌లో ఎంతో సింపుల్‌గా కనిపించింది. టేబుల్‌పై పుస్తకం, వాటర్ బాటిల్ ఉండగా, ప్రశాంతంగా కూర్చుంది సమంత. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆమె రాసిన క్యాప్షన్. ఇదే నా సిక్స్ ప్యాక్.. నిన్ను చూడాల్సిన సమయంలో చూస్తాను అంటూ ఫన్నీగా రాసుకొచ్చారు. ఆ క్యాప్షన్ తో మరోసారి అధికారికంగా తెలియడమే కాకుండా ఆ మాటలతో అభిమానుల మనసును కూడా దోచేసింది సమంత.

ఇక పోస్ట్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత గత ఏడాది డిసెంబర్ 1న దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు.'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి ప్రాజెక్టుల్లో కలిసి పనిచేసిన వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి, తర్వాత వివాహ బంధంతో ఒక్కటైంది. పెళ్లి జరిగిన కొద్ది నెలలకే ఈ దంపతులు తమ తొలి బిడ్డకు స్వాగతం పలకబోతుండటం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.

ఇదిలా ఉంటే.. సమంత 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రెండో వీకెండ్‌లో అద్భుతమైన వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో సోమవారం కలెక్షన్లు తగ్గినా బాక్సాఫీస్ రన్‌ను బలంగా కొనసాగిస్తోంది. 11వ రోజులలో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ మొత్తం రూ.49.85 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకోగా, రూ.57.72 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఓవర్సీస్‌లో రూ.23.15 కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ మూవీ.

బిగ్‌బాస్‌కు వెళ్లాలంటే చాలా గట్స్ ఉండాలి.. అలా ఉండటం నావల్ల కాదు

ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.80.87 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటికే రూ.42.96 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'మా ఇంటి బంగారం' త్వరలోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా విజయంతో మేకర్స్ ఇప్పటికే 'మా ఇంటి బంగారం పార్ట్-2'ను అధికారికంగా ప్రకటించగా, సమంత కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా ఈ సినిమా నిలిచిందనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X