ఛార్మీ వల్లే పూరీ జగన్నాథ్ కెరీర్ నాశనం... టాప్ విలన్ షాకింగ్ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమలోని దర్శకులలో పూరీ జగన్నాథ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా అభిమానులు ఆయను ముద్దుగా పిలుచుకుంటారు. హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేయడంలో స్టార్స్‌ను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడంలో పూరీ దిట్ట. ఆయనతో సినిమాలు చేసిన హీరోలకు స్టార్ ఇమేజ్ ఖాయం. అప్పటి వరకు మూసలో వెళ్తున్న తెలుగు చిత్ర పరిశ్రమను తన సినిమాలతో కొత్తగా మార్చి తన టేకింగ్, డైలాగ్‌లతో ట్రెండ్ సెట్ చేశారు. టాలీవుడ్‌లోని అందరూ అగ్రనటులతో పాటు అమితాబ్ బచ్చన్, పునీత్ రాజ్ కుమార్ వంటి దిగ్గజాలను డైరెక్ట్ చేసిన ఘనత పూరీ జగన్నాథ్‌ది.
ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ దర్శకుడిగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు పూరీ జగన్నాథ్. ఆయనతో సినిమాలు చేసేందుకు దక్షిణాదితో పాటు బాలీవుడ్ హీరోలు కూడా క్యూ కట్టేవారంటే పూరీ ఛరిష్మాను అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడది గతం.. వ్యక్తిగత సమస్యలు, వరుస ఫ్లాపులతో పూరీ రేసులో వెనుకబడ్డారు. ఇస్మార్ట్ శంకర్‌తో కమ్ బ్యాక్ ఇచ్చినప్పటికీ లైగర్‌తో మరోసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ తీస్తున్నారు పూరీ.

పూరీ జగన్నాథ్‌కి భార్య లావణ్య, కుమారుడు ఆకాష్ పూరీ ఉన్నారు. కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఆయన జీవితంలో ఛార్మీ కౌర్ ఎంట్రీ.. ఆమెతో ఆయన బంధం అనేక ఊహాగానాలకు తావిచ్చింది. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ ఫిలింనగర్‌లో ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. భార్యాబిడ్డలకు దూరంగా ఉండటం, పూరీ ఎక్కడుంటే ఛార్మీ అక్కడ కనిపించడం.. పూరీ జగన్నాథ్- ఛార్మీలు కలిసే సినిమాలు నిర్మించడం, ఇతరత్రా అంశాలు ఈ రూమర్స్‌కు బలం చేకూరుస్తున్నాయి.
ఛార్మీతో తన బంధంపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై పూరీ జగన్నాథ్ పలుమార్లు స్పందించారు. ఛార్మీ తనకు 20 ఏళ్లుగా తెలుసు.. మేమిద్దరం ఎన్నో సినిమాలలో కలిసి పనిచేశాం. కానీ అందరూ అనుకుంటున్నట్లు మా మధ్య ఎలాంటి రొమాంటిక్ బంధం లేదు. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, అదే శాశ్వతమని పూరీ తెలిపారు. కానీ నేటికీ కూడా పూరీ జగన్నాథ్, ఛార్మీల రిలేషన్‌పై ఊహాగానాలకు చెక్ పడటం లేదు. తాజాగా వీరిద్దరి బంధంపై బాలీవుడ్ నటుడు షావర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు అజాజ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ది అన్‌ఫిల్టర్డ్ విత్ అజాజ్ ఖాన్ కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరైన షావర్ అలీ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
షావర్ అలీ మాట్లాడుతూ.. కొన్ని విషయాల్లో తన గురువు రాంగోపాల్ వర్మను పూరీ జగన్నాథ్ ఫాలో అయ్యాడు. కాపురం విషయంలో కూడా ఆయన లాగే చేసి.. భార్య, పిల్లలను వదిలేశాడు. దక్షిణాదిలో ప్రేక్షకుల దృష్టిలో విలన్ అయ్యాడు. అతడికి హీరోలు రెస్పక్ట్ ఇవ్వడం మానేశారు. షూటింగులకు ఆలస్యంగా వచ్చేవారు.. సెట్‌లో నీరసంగా ఉండేవాడు. ఇందుకు కారణం చార్మీ కౌర్‌తో ఉన్న రిలేషన్. ఆ కారణంగానే పూరీ తన పాపులారిటీని కోల్పోయాడు. ఆయనేంటో నాకు పూర్తిగా తెలుసు. ఆయనతో సినిమాలు చేశాను. పూరీ మంచి మనసున్న వ్యక్తి. ఆయన లాంటి మంచి మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను ఆయనతో నాలుగు సినిమాలు చేశాను. నన్ను ఇండస్ట్రీకి విలన్‌గా పరిచయం చేసింది ఆయనే. ఓ దశలో సెకండ్ విలన్ చేయమని చెప్పాడు. ఆ తర్వాత మెయిన్ విలన్ చేస్తానని అన్నాడు. ఈ మధ్యలో చార్మీ కౌర్ ఎంట్రీ ఇచ్చింది. ఇక అంతా నాశనమే అని అన్నారు.
పూరీ జగన్నాథ్‌తో చార్మీ కలిసిన తర్వాత ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులందరూ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పూరీని పూర్తిగా తన చేతిలో కంట్రోల్‌లో పెట్టుకొన్నది. ఆమె వల్ల కంపెనీ, సినిమాలు, ఫ్యామిలీ అంతా బర్‌బాద్ అయ్యారు. అంతకుముందు మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి హీరోలు ఆయనను కలిసేందుకు వచ్చే వారు. పూరీని అందరూ హీరోలు సార్ అని పిలిచే వారు. అలాంటి వ్యక్తిని చార్మీ భ్రష్టుపట్టించింది. ఇప్పుడు విలన్ రోల్స్ వేసే వాళ్లందరికి చార్మీ అంటే విపరీతమైన కోపం అని తన ఇంటర్వ్యూలో ఘాటుగా విమర్శలు గుప్పించారు.
ఇంటర్వ్యూ వీడియో కింద నెటిజన్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చార్మీ కారణంగానే పూరీ కెరీర్ భ్రష్టుపట్టింది. కానీ ఈ విషయాన్ని చెప్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. తొలిసారి హిందీ యాక్టర్లు గళం విప్పారు. ఆకాశ్ పూరీని, వారి కుటుంబాన్ని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంటుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications




