ఓ ఇంటి వారైన శృతి హాసన్.. కొత్త జీవితానికి కమల్ కూతురు శ్రీకారం..
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ శృతి హాసన్. ఈ అమ్మడు నటిగా, గాయనిగా, డ్యాన్సర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో సక్సెస్ కోసం ఎదురుచూసిన ఈ స్టార్ బ్యూటీ.. ఇప్పుడు వరుస హిట్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. ముఖ్యంగా సలార్ విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది శృతి.. ఇటీవల రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఐటెం నెంబర్‌తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సలార్ 2తో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె.. వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అడుగు వేసింది. ఇంతకీ ఆ స్పెషల్ ఎంటీ?
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటికే తనకు ముంబైలో ప్రత్యేకమైన ఇంటి ఉంది. తాజాగా చెన్నైలో కొత్త ఇంటిని సొంతం చేసుకుని సంప్రదాయబద్ధంగా గృహప్రవేశం చేసింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు శృతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గృహప్రవేశ వేడుకలో శృతి చాలా సింపుల్‌గా, సంప్రదాయబద్ధంగా పూజల్లో పాల్గొంది. ఆమె షేర్ చేసిన ఫోటోల్లో పూజా కార్యక్రమాలు, స్వీట్లు, కొత్త ఇంటి తాళాలు కనిపించాయి. ఆడంబరాలకు దూరంగా, కుటుంబ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక అభిమానులను ఆకట్టుకుంది. కొత్త ఇంట్లో అడుగుపెట్టే ముందు దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో శృతి ఈ పూజను నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త ఇల్లు శృతికి కేవలం మరో చిరునామా మాత్రమే కాదు. ఆమె వ్యక్తిత్వాన్ని, అభిరుచులను ప్రతిబింబించే ఓ వ్యక్తిగత ప్రపంచంగా ఈ ఇంటిని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. శృతి సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేసిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొందరు అభిమానులు ఆమె కొత్త ఇంటి పూర్తి టూర్ వీడియో కోసం కూడా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
శృతి నటిగా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. సినిమాలు, మ్యూజిక్ రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఇక శృతి కెరీర్ చూస్తే.. ప్రస్తుతం శృతి చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న 'ట్రైన్' సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రముఖ వెబ్ సిరీస్ 'కాల్ మీ బే' సీజన్-2 లో కూడా ఆమె కనిపించనుంది. ఇక 'సలార్ 2'మూవీలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో శృతి మరింత బిజీ కానుంది.


Click it and Unblock the Notifications



