పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అన్నా లెజినోవా ఎమోషనల్.. ఆయన బాధను మాటల్లో చెప్పలేనంటూ..

Pawan Kalyan Health Update: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. శనివారం నాడు డాక్టర్లు పవన్ కల్యాణ్ కుడి భుజానికి మూడున్నర గంటలపాటు సర్జరీ చేయడం తెలిసిందే. సర్జరీ అనంతరం అక్కడే డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ఒక ప్రత్యేక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఆయనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవా ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఎమోషనల్ ట్విట్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిస్క్.. 'రాకా'లో షాకింగ్ ట్విస్ట్ ఇదేనా?
అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిస్క్.. 'రాకా'లో షాకింగ్ ట్విస్ట్ ఇదేనా?

భార్య అన్నా భావోద్వేగ పోస్ట్ వైరల్
శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులను కదిలించింది. తన భర్త జీవితంలో శారీరక నొప్పి కంటే బాధ్యతల భారం ఎప్పుడూ ఎక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. "ఆయన జీవితంలో మోయాల్సిన బాధ్యతలు చాలా పెద్దవి. ఆయన చాలా అరుదుగానే తన బాధ గురించి చెబుతారు. నొప్పి కూడా భరించలేనంతగా పెరిగినప్పుడు మాత్రమే బయటపెడతారు" అని ఆమె రాశారు. ప్రస్తుతం తన బాధ్యత ఒక్కటేనని, "ఆయనను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం, ఆయన సురక్షితమైన చేతుల్లో ఉన్నారనే నమ్మకాన్ని కల్పించడం నా పని. ఒక్కో రోజు ముందుకు సాగుతూ పూర్తిగా కోలుకునే వరకు ఆయనకు అండగా ఉంటాను" అని పేర్కొన్నారు.

Pawan Kalyan Wife Anna Lezhneva Emotional Note After Successful Shoulder Surgery
Recommended For You
 MIB Box Office Collections: సమంత సరికొత్త చరిత్ర.. మా ఇంటి బంగారం సంచలన రికార్డు
MIB Box Office Collections: సమంత సరికొత్త చరిత్ర.. మా ఇంటి బంగారం సంచలన రికార్డు

ఏ గాయం కారణంగా సర్జరీ?
ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో జూలై 11న పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఆర్థ్రోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స జరిగింది. ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. పవన్‌కు కుడి భుజంలో రొటేటర్ కఫ్ ఇంజరీ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సుప్రాస్పినేటస్, ఇన్‌ఫ్రాస్పినేటస్ అనే రెండు కీలక కండారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అలాగే.. గ్రేటర్ ట్యూబరోసిటీ ఎముక వద్ద అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రముఖ ఆర్థ్రోస్కోపీ, షోల్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ దిన్‌షా పార్దివాలా నేతృత్వంలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ఆస్పత్రి వెల్లడించింది.

You May Also Like
పవన్ కళ్యాణ్ కోసం నానికి షాక్!.. సుజీత్ ప్లానింగ్ అదేనా?
పవన్ కళ్యాణ్ కోసం నానికి షాక్!.. సుజీత్ ప్లానింగ్ అదేనా?

నాలుగు నెలల రెస్ట్
వైద్యుల ప్రకారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే భుజం పూర్తిస్థాయిలో మామూలు స్థితికి రావడానికి విశ్రాంతితో పాటు క్రమబద్ధమైన షోల్డర్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ తప్పనిసరి. ఫిజియోథెరపీ, వ్యాయామాలు, వైద్యుల పర్యవేక్షణతో దాదాపు నాలుగు నెలల్లో భుజం పనితీరు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

పైసా కొట్టు.. డైలాగ్ పట్టు.. ప్రకాశ్ రాజ్‌‌కు బండ్ల గణేశ్ స్ట్రాంగ్ కౌంటర్..
పైసా కొట్టు.. డైలాగ్ పట్టు.. ప్రకాశ్ రాజ్‌‌కు బండ్ల గణేశ్ స్ట్రాంగ్ కౌంటర్..

పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లారు. పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన సతీమణి అన్నాతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులతో కూడా మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. తగినంత విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోలుకోవాలని పవన్‌కు సూచించారు.

జానకమ్మ ప్రేమకథలో ఇన్ని ట్విస్టులా?.. గుండెను తాకే రియల్ లైఫ్ స్టోరీ!
జానకమ్మ ప్రేమకథలో ఇన్ని ట్విస్టులా?.. గుండెను తాకే రియల్ లైఫ్ స్టోరీ!

ఇక పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతమైందనే వార్తతో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X