Sobhita: సమంతతో బ్రేకప్.. చైతూ అలా నా వెంటపడి.. లవ్ స్టోరీ లీక్ చేసిన శోభిత ధూళిపాల
ఒకప్పుడు తెలుగు సినిమా దగ్గర చాలా మందికి మెయిన్ గా యూత్ గా బాగా ఇష్టమైన ప్రేమ జంటల్లో అక్కినేని హీరో నాగ చైతన్య అలాగే స్టార్ బ్యూటీ సమంతల జంట కూడా ఒకటని చెప్పాలి. నిజానికి చాలా మంది మన తెలుగులో ఉన్నప్పటికీ మోస్ట్ ఫెవరెట్ గా మాత్రం వీరే యూత్ కి ఆదర్శంగా ఉండేవారు. ఇలా ఈ యువ జంట తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లి కొన్నేళ్లు పాటు అన్యోన్యంగా కూడా ఉన్నారు.
కాగా తర్వాత ఇద్దరి నడుమ అంతర్గతంగా ఏమొచ్చాయో కానీ అంత గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. మరి ఇక్కడ నుంచి వారి విడాకులు అనంతరం కొన్నాళ్ల పాటుగా ఇద్దరు చాలా విడిగానే ఉండడం మధ్యలో సమంత నాగ చైతన్యపై పలు సందర్భాల్లో కోపం ప్రదర్శించడం అంతే కాకుండా మరికొన్నిసార్లు తన మాజీ భర్తపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ కూడా వేయడం చేసింది.

కానీ చైతు మాత్రం ఒక్కసారి కూడా ఎప్పుడూ సామ్ ని పల్లెత్తి ఒక్క మాట విడిపోయిన తర్వాత అనలేదు. ఇలా ఇద్దరూ వేరయ్యాక సామ్ తన నెక్స్ట్ స్టెప్ ఏంటి పర్శనల్ లైఫ్ లో మరో పెళ్లి చేసుకుంటుందా అనే వాటిని పట్టించుకోలేదు. దాదాపు అయితే తాను మరో పెళ్లి చేసుకోను అన్నట్టే చెప్పుకొచ్చింది. కానీ నాగ చైతన్య మాత్రం రెండో పెళ్లి చేసుకుని ట్విస్ట్ ఇచ్చాడు.
ముగ్గురు హీరోయిన్లతో బబ్లూ పృథ్వీరాజ్ ఎఫైర్స్.? ఇప్పటికీ అలానే ఉన్నాం!
అది కూడా సినీ పరిశ్రమకి చెందిన నటినే పైగా ప్రేమ పెళ్లి కావడం అనేది మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అని చెప్పాలి. కాగా ఈ ప్రేమ పెళ్లిపై కొన్ని షాకింగ్ నిజాలు ఇపుడు శోభిత నుంచి బయటకి వచ్చాయి. సమంతతో నాగ చైతన్య 2021 లో విడిపోవడం జరిగింది. అయితే అప్పుడు నుంచి మళ్ళీ 2024లో నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు.
అయితే మధ్యలో ఏం జరగకుండానే వీరు పెళ్లి చేసుకున్నారా అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉండొచ్చు. కానీ అది నిజమే అట. సామ్ తో అలా 2021 లో విడాకులు అయితే 2022 నుంచే శోభిత విషయంలో చైతూనే ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడట. తానే ఆమెతో మొదట చాట్ చేయడం స్టార్ట్ చేసాడట. నిజానికి సోషల్ మీడియాలో కూడా శోభిత కంటే నాగ చైతన్యని ఫాలో చేయనప్పటికీ నాగ చైతన్య ఆమె ఫాలో అవుతూ ఉండేవాడట.
అది తర్వాత తెలిసి అక్కడ నుంచి ఆమె అతన్ని ఫాలో చేసినట్టుగా రివీల్ చేసింది. ఇక అక్కడ నుంచి చాటింగ్ లు స్టార్ట్ అయ్యి 2022 ఏప్రిల్ లో మొదటిగా చైతుని కలిసినట్టుగా ఆమె మరో ట్విస్ట్ ఇచ్చింది. అంటే సామ్ తో విడిపోయిన నెలల వ్యవధిలోనే ఇదంతా జరిగింది అని చెప్పవచ్చు.అక్కడ నుంచి తమ రిలేషన్ ప్రేమగా అక్కడ నుంచి పెద్దలని ఒప్పించి పెళ్లిగా మారింది అని అసలు విషయం శోభిత రివీల్ చేసింది. దీనితో విడాకులు తర్వాత ఫస్ట్ అప్రోచ్ మాత్రం నాగ చైతన్య సైడ్ నుంచే అయ్యిందని చెప్పాలి. ఇక ఇవి పక్కన పెడితే రీసెంట్ గానే చైతూ తండేల్ అనే భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











