అలా చేస్తే.. ఇండస్ట్రీకి దూరంగా ఉండటమే బెటర్..: శోభిత ధూళిపాళ్ల
Sobhita Dhulipala: 'గూఢచారి', 'మేజర్' వంటి సినిమాలతో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత ఆమె పేరు మరింతగా చర్చల్లో నిలుస్తోంది. అయితే, కేవలం అక్కినేని కోడలిగానే కాకుండా... ఒక నటిగా తన కెరీర్ ఎంపికలు, పాత్రల విషయంలో స్పష్టమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారని తాజా ఇంటర్వ్యూ స్పష్టం చేసింది.
శోభితా తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో '. సురేష్ బాబు నిర్మాణంలో, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 23 నుంచి అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ పాత్ర, కెరీర్ ప్లానింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చీకటి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శోభిత ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

చీకటిలో సినిమాను ఒప్పుకోవడానికి ప్రధాన కారణం థ్రిల్లర్ జానర్ అని తెలిపారు.'ఇది కేవలం సీరియస్ థ్రిల్లర్ మాత్రమే కాదు... ఫన్, ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా నా పాత్రలో ఉన్న మొండితనం, గట్స్ నేచర్, లీడర్‌షిప్ క్వాలిటీస్ నాకు బాగా నచ్చాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా... తన నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే క్యారెక్టర్ ఇది. భయం ఉన్నా సరే, నమ్మిన దానికి కోసం పోరాడే తత్వం నచ్చింది'అని చెప్పారు.
ఈ లక్షణాలు మీ రియల్ లైఫ్‌లో కూడా ఉన్నాయా? అని యాంకర్ అడగగా, శోభిత నవ్వుతూ... 'ఏమో కావచ్చు... లేదా క్యారెక్టర్‌లో మనల్ని మనం వెతుక్కుంటామేమో'అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇక క్యారెక్టర్ సెలక్షన్ గురించి మాట్లాడుతూ.. 'నేను మొదటినుంచి హిందీ సినిమాల్లో వర్క్ చేశాను. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ప్రతి సినిమా కోసం ఆడిషన్లు ఇచ్చుకుంటూ ఇక్కడిదాకా వచ్చాను. నాకు వచ్చిన ప్రతి క్యారెక్టర్‌కు 100 శాతం న్యాయం చేయడమే నా లక్ష్యం. తెలుగులో 'గూఢచారి' చేసినప్పుడు పాటలు, ఫైట్స్ ఉన్నా... నా పాత్రకు ఒక మీనింగ్ ఉంది. నేను చేసే క్యారెక్టర్ సినిమా కోసం అలంకారంలా ఉండకూడదు. ఆ పాత్ర ద్వారా ఒక ఇంపాక్ట్ ఉండాలి'అని క్లారిటీ ఇచ్చారు.
NTR- Ram Charan : ఎన్టీఆర్ అంటే అంత భయమా? రామ్ చరణ్ కామెంట్స్ వైరల్
ఇక చీకటి సినిమా మీ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందని యాంకర్ ప్రశ్నించగా.. 'ప్రతి సినిమాకు ఆ సినిమా ప్రత్యేకమే. నేను ప్రతి ప్రాజెక్ట్‌ను తూకం వేసుకుంటూ, లెక్కలు కట్టుకుంటూ నిర్ణయాలు తీసుకోను. యాక్టింగ్ అనేది నాకు చాలా ఇష్టం. ఒకసారి నాకు నచ్చిన క్యారెక్టర్‌ను సెలెక్ట్ చేసుకున్నాక, దానికి 100 శాతం ఇవ్వడమే నా బాధ్యత. అలా కాకుండా ప్రతి విషయాన్ని లాభనష్టాల కోణంలో చూసుకుంటూ వెళ్తే... ఈ క్రియేటివ్ ఫీల్డ్‌లో, ఇండస్ట్రీలో ఉండడమే తప్పు'అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నటిగా తన ప్రయాణాన్ని చాలా సహజంగా చూస్తానని, ఒక్క సినిమా తన కెరీర్‌ను నిర్వచించదని శోభిత స్పష్టం చేసింది. తనకు నచ్చిన పాత్ర దొరికితే, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడమే తన లక్ష్యమని మరోసారి చెప్పింది. ఈ మాటల ద్వారా ఆమె గ్లామర్‌కి కాదు, పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే నటిగా తన స్టాండ్‌ను మరోసారి స్పష్టం చేసింది. అదే సమయంలో తన కుటుంబం గురించి మాట్లాడిన శోభిత, తన బాల్యం మొత్తం వైజాగ్‌లోనే గడిచిందని వెల్లడించింది. 'చిన్నప్పటి నుంచే నా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఈ ఫీల్డ్ గురించి వారికి పెద్దగా అవగాహన లేదు. కానీ నాకు నచ్చిన పని చేసుకోవడానికి కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు' అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. శోభితా ధూళిపాళ్ల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications











