నాకు సీక్రెట్ లవర్.. పిల్లలు కావాలనుకొన్నప్పుడే పెళ్లి.. తాప్సీ
ఝుమ్మంది నాదం సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ తాప్సి పన్ను. సొట్టబుగ్గల సుందరి అదృష్టం ఏమిటో గాని సౌత్ లో క్లిక్కవ్వకపోయినా బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. మంచి ఆఫర్స్ అందుకుంటూ తనదైన శైలిలో బాక్సాఫీస్ హిట్స్ ని అందుకుంటోంది. అలాగే ఆమె ఎంచుకుంటున్న కథలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఇక ఇటీవల ఈ బ్యూటీ తన రహస్య ప్రేమికుడిపై ఎవరు ఊహించని విధంగా స్పందించింది.
అలాంటి నమ్మకాన్ని కలిగించిన చిత్రమదే.. హీరోయిన్ కామెంట్స్

బికినీ షో..
ఎప్పుడైతే తాప్సి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ బికినీ వేసిందో అప్పటి నుంచి బ్యూటీ తలరాత మారిపోయింది. ఆమె అందాలకు నార్త్ జనాలు బాగానే ఎట్రాక్ట్ అయ్యారు. వరుసగా ఆఫర్స్ రావడంతో తాప్సి కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంది. తొందరపడకుండా సెలెక్ట్ చేసుకున్న ఆ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. మెల్లమెల్లగా తన బాక్సాఫీస్ స్థాయిని పెంచుకుంటూ వెళుతోంది.

సీక్రెట్ బాయ్ ఫ్రెండ్..
తాప్సి పన్ను బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన మొదట్లో రూమర్స్ కి పెద్దగా తావివ్వలేదు. కానీ అమ్మడు తన సీక్రెట్స్ ని ఎక్కువ రోజులు దాయలేకపోయింది. ఒక స్టార్ హీరోతో లవ్ లో ఉన్నట్లు రూమర్స్ రావడంతో అసలు విషయాన్ని బయటపెట్టింది. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్న మాట వాస్తవమే అంటూ.. కానీ అతని గురించి ఎవరికి తెలియదని చాలా సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

సినిమా హీరో కాదు..
అందరూ అనుకుంటున్నట్లు అతను సినిమా హీరో కాదని అలాగే నిర్మాత కూడా కాదని ఇంతవరకు తనకు సినిమా ఫీల్డ్ తో ఏ మాత్రం సంబంధం లేదని తెలిపింది. ఇప్పట్లో అతని గురించి చెప్పడం తనకు ఇష్టం లేదని చెప్పిన తాప్సి ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా రూమర్స్ విషయంలో మీడియా తప్పటడుగు వేస్తోందని నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని తాప్సి కౌంటర్ ఇచ్చింది.
Recommended Video

అప్పుడే పెళ్లి..
"ప్రస్తుతం నా టార్గెట్ నా కెరీర్ మాత్రమే. ఎవరెన్ని రూమర్స్ క్రియేట్ చేసినా నేను పట్టించుకోను. పెళ్లి, ప్రేమ వ్యవహారం అనేది పూర్తిగా నా పర్సనల్ విషయం. పిల్లలు కావాలని అనుకున్నపుడే నేను పెళ్లి చేసుకుంటాను. ఇక నా బాయ్ ఫ్రెండ్ తో గత కొన్నేళ్లుగా నా రిలేషన్ బాగానే ఉంది. అతను నన్ను చాలా బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది" అంటూ తాప్సి వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











