త్రిషతో లిప్ లాక్.. వద్దంటే వద్దన్న స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

స్టార్ హీరోయిన్ త్రిష సౌత్ ఆడియన్స్ లో ఎంతటి గుర్తింపు దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తమిళనాడుకు చెందినప్పటికీ తెలుగు చిత్రాలతో మంచి హిట్స్ అందుకుంది. టాలీవుడ్ లో బడా హీరోల సరసన నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించి చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన నటనతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది.

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష కు ఒక ప్రత్యేక స్థానం దక్కింది. ఇప్పటికీ త్రిష యంగ్ హీరోయిన్లకు షాక్ ఇచ్చేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తుంది. వర్షం, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బుజ్జిగాడు, స్టాలిన్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు వంటి ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా త్రిష తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించింది. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదలై మంచి రిజల్ట్ ను అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా విజయాన్ని సాధించింది.

Tamil actor rejects heroine Trisha for lip lock scene

ఈ క్రమంలో త్రిష గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే త్రిష ఎంతో మంది హీరోలతో కలిసి నటించినప్పటికి ఎవరితోనో లిప్ లాక్ సీన్లు చేయలేదు. చిన్నాచితకా రొమాంటిక్ సీన్లు మినహా పెద్దగా కిస్ సీన్లలో నటించిన దాఖలాలు లేవు. అయితే ఒక స్టార్ హీరోకు మాత్రం త్రిష లిప్ లాక్ సీన్ చేసే అవకాశం ఇచ్చిందంట. కానీ ఆ స్టార్ హీరో మాత్రం త్రిషతో లిప్ లాక్ సీన్ వద్దంటే వద్దని చెప్పారంట. చిత్ర యూనిట్ ఎంతగా ప్రోత్సహించిన అస్సలు చేయనని మొహం మీదనే చెప్పేశారు.

ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు తమిళ చిత్ర పరిశ్రమలో నేచురల్ యాక్టింగ్ తో దుమ్ములేపుతున్న విజయ్ సేతుపతి కావడం విశేషం. విజయ్ సేతుపతి త్రిష కలిసి జంటగా నటించిన చిత్రం 96. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలోని విజయ్ సేతుపతిని త్రిషతో లిప్ లాక్ సీన్ చేయాలని అడిగారంట. కానీ విజయ్ సేతుపతి అస్సలు వద్దని చెప్పారంట. అందుకు కారణం కూడా వివరించారంట విజయ్ సేతుపతి.

96 సినిమాలో రామ్, జాను పాత్రలు ఎంతో భావోద్వేగంగా, చాలా చక్కగా ఉండడంతో లిప్ లాక్ సీన్స్ అస్సలు ఫిట్ కావని భావించారంట. ఇక విజయ్ సేతుపతి చెప్పడంతో టీమ్ మౌనంగా ఉన్నారంట. ఆ తర్వాత విజయ్ సేతుపతి తీసుకున్న నిర్ణయమే సినిమాకు ఎంతో ప్లస్ అయింది అంట. 18 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అయితే సినిమాలో పాత్రలను విజయ్ సేతుపతి ఎంతో అర్థం చేసుకుంటారని మరోసారి ఈ సినిమాతో స్పష్టం అయ్యింది. ఇక త్వరలో విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు త్రిష నెక్ట్స్ మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర'తో అలరించబోతోంది. ఆ తర్వాత కమల్ హాసన్ తో 'థగ్ లైఫ్', సూర్య45వ చిత్రాలతో రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X