కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. 14 ఏళ్ల వయసులోనే.. ఇప్పటికీ అడుగుతున్నారు: ఛార్మి

Recommended Video

Charmy Kaur Opens Up About Struggles In Her Career || Filmibeat Telugu

ముంబై భామ ఛార్మి కౌర్ అందచందాలతో ఒకప్పుడు వెండితెరకే కొత్త శోభ సంతరించుకుంది. గ్లామర్ ఒలికించడంలో నయా ట్రెండ్‌కి శ్రీకారం చుడుతూ 2001 సంవత్సరంలో నీ తోడు కావాలి అంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఛార్మి. ఆ తర్వాత బడా హీరోలతో నటించి పలు సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి సినీ నిర్మాణ కార్యక్రమాల్లో భాగం పంచుకుంటోంది. వెండితెరపై కనిపించడం పక్కకు పెట్టి పూర్తి సమయం పూరీకే కేటాయించి నిర్మాణ రంగంలో దూసుకుపోతోంది ఛార్మి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

14 ఏళ్ల వయసులో

14 ఏళ్ల వయసులో

కేవలం 14 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తాను కెరీర్ ఆరంభంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని అంటోంది ఛార్మి. ఎలాగోలా నెట్టుకుంటూ వచ్చి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె పేర్కొంది. అయితే గ్లామర్ ఫీల్డ్ వదిలి నిర్మాణ రంగంలో అడుగుపెట్టినా తనను హీరోయిన్‌‌గా తీసుకుంటామని చాలామంది దర్శకులు అడుగుతున్నారంటోంది.

సంతృప్తిగా ఉంది

సంతృప్తిగా ఉంది

సినీ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా చేసిన ప్రయాణం చాలా సంతృప్తిగా ఉందని ఛార్మి చెబుతోంది. ఇప్పటికీ హీరోయిన్ అవకాశాలు వస్తున్నా వాటిని సున్నితంగా తిరస్కరించి నిర్మాణ రంగంపైనే దృష్టి పెడుతున్నానని ఛార్మి పేర్కొంది.

పూరి జగన్నాథ్‌తో బిజీగా

పూరి జగన్నాథ్‌తో బిజీగా

ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో కలిసి ఇస్మార్ట్ శంకర్ నిర్మాణంలో బిజీగా ఉంది ఛార్మి. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకాలపై ఛార్మి, పూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది.

ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్నారు. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ రామ్ తో చిందులేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. చిత్ర విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X