Ambajipeta Marriage Band అందుకే రెండుసార్లు గుండు కొట్టించుకొన్నా.. ఆ టాప్ నిర్మాత ఏమన్నాడంటే.. సుహస్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో GA2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ రూపొందిన చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండ్. తొలిసారి డైరెక్టర్‌గా మారి దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సుహాస్ హీరోగా, నూతన నటి శివానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని నిర్మాతగా, మారుతి, వెంకటేష్ మహా సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో సుహాస్ మాట్లాడుతూ..
లాక్ డౌన్ తర్వాత దర్శకుడు దుశ్యంత్ చెప్పిన కథ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాకు కథనే ప్రాణం. ఈ కథలో ఉండే లవ్ ట్రాక్, సిస్టర్ సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకొంటాయని భావిస్తున్నాను. ఈ సినిమా నన్ను ఇండస్ట్రీలో నిలబెడుతుందనే గట్టి నమ్మకం ఏర్పడింది. అందుకే నేను ఈ సినిమాలో భాగమయ్యాను అని హీరో సుహస్ చెప్పారు.

అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా కోసం అంబాజీ పేటకు వెళ్లి బ్యాండ్ నేర్చుకొన్నాను. దాదాపు నెలరోజులపాటు నేను బ్యాండ్ కొట్టడం ఎలా అని నేర్చుకొని ప్రొఫెషనల్‌గా మారాను. బ్యాండ్ కొట్టడం విషయంలో నటించకూడదు.. నేచురల్‌గా ఉండకూడదని మేము భావించాం. అందుకే చాలా కష్టపడ్డాం అని సుహస్ చెప్పారు.
నా కెరీర్ ఆరంభంలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా కోసం గుండు కొట్టించాలని నిర్ణయించుకోవడం చాలా రిస్క్‌గా అనిపించింది. పాత్ర కోసం ఆ మాత్రం చేయకపోతే ఫీల్ ఉండదని గుండు కొట్టించుకొన్నాను. షూటింగ్ గ్యాప్ రావడంతో రెండోసారి కూడా సీన్ కంటిన్యుటి కోసం గుండు కొట్టించుకొన్నాను అని సుహాస్ చెప్పారు.
భారీగా డ్రగ్స్‌తో యువ సినీహీరో లవర్ అరెస్ట్.. పోలీసుల అదుపులో యువతి!
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాను అల్లు అరవింద్ చూశారు. ఈ సినిమా చూసి బాగా పెర్ఫార్మ్ చేశావని భుజం తట్టాడు. అంత గొప్ప నిర్మాత నన్ను మెచ్చుకోవడం కంటే ఏం కావాలి. ఆయన మాటలు నాకు మంచి కాన్ఫిడెన్స్ పెంచింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కూడా కలిగింది అని సుహాస్ చెప్పారు.
అంబాజీపేటలో దాదాపు 3 నెలలపాటు షూటింగ్ చేశాం. దాంతో ఆ ఊరితో మంచి అనుబంధం ఏర్పడింది. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ ఊరి నుంచి రావాలని అనిపించలేదు. అందరూ వచ్చేసినా.. నేను వారం రోజులపాటు అక్కడే ఉన్నాను. ఆ ప్రాంతంలో అన్ని చోట్లు తిరుగుతూ ఎంజాయ్ చేశాను. సినిమా రిలీజ్ తర్వాత ఆ ప్రాంతంలో మాతో పనిచేసిన వారికి మంచి పార్టీ ఇద్దామని అనుకొంటున్నాను అని సుహాస్ చెప్పారు.


Click it and Unblock the Notifications











