Romantic నాన్న నుంచి దూరంగా పారిపోవాలని ఉంది.. ఆ ఇద్దరు నాకు దేవుళ్లు.. ఆకాశ్ పూరి ఎమోషనల్
ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా రొమాంటిక్. ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన రిలీజ్ అవుతున్నది. అనిల్ గారు.. నాన్నతో కలిసి కంప్యూటర్ గ్రాఫిక్స్ చేస్తారు. అయితే ఓ రోజు నాన్న అనిల్ నీవు సినిమా చేస్తున్నావని చెప్పారు. దాంతో ఆయన నేను షాక్ తిన్నాం అని ఆకాశ్ పూరి చెప్పారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆకాశ్ పూరి మాట్లాడుతూ..

నా పాత్ర పేరు వాస్కోడిగామా
రొమాంటిక్ సినిమాలో నా క్యారెక్టర్ పేరు వాస్కోడి గామా. నాన్న తీసిన సినిమాల్లో చంటి లాంటి పాత్రల మాదిరిగానే ఉంటుంది. మన వద్ద శ్రీను లాంటి పేర్లు చాలా ఉంటాయి. అలాగే గోవాలో వాస్కోడిగామా అనే పేరు కామన్. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నాన్న రాసిన డైలాగ్స్ ఎట్రాక్టివ్‌గా ఉంటాయి. దర్శకుడు అనిల్ చూస్తే ఫస్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని అనిపించలేదు. తప్పకుండా ఈ సినిమాతో మంచి డైరెక్టర్ అవుతాడు అని ఆకాశ్ పూరి అన్నారు.

రమ్యకృష్ణతో నటించడం ఛాలెంజ్
రొమాంటిక్ సినిమాలో రమ్యకృష్ణతో నటించడం నాకు ఛాలెంజ్ అనిపించింది. నరసింహా సినిమాలో రజనీకాంత్‌తో సమానంగా నటించిన ఆమెతో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టం. ఆమెతో నా సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయి. చాలాసార్లు డైలాగ్స్, యాక్టింగ్ విషయంలో తడబడ్డాను. కానీ ఆమె చాలా కూల్‌గా ఫర్వాలేదు. తొందర ఏమిలేదు అని చెప్పారు అని ఆకాశ్ పూరి అన్నారు.

నాన్న.. రొమాన్స్ తగ్గించు అంటే..
నాన్న కథ చెప్పినప్పటి నుంచి రొమాంటిక్ సినిమాలో కాస్త రొమాన్స్ తగ్గించమని అడిగాను. అయితే సినిమానే రొమాంటిక్. అందులో రొమాన్స్ లేకపోతే ఎలా అంటూ నాన్న అన్నారు. మా నాన్న నుంచి దూరంగా పారిపోవాలని అనుకొంటున్నాను. నా కోసం మా నాన్న చాలా ఇచ్చారు. చాలా డబ్బు ఖర్చు చేశారు. ఇక నుంచి మా నాన్నకు తిరిగి ఇవ్వాలని అనుకొంటున్నాను. నాన్నతో కలిసి పనిచేయాలని అనుకొంటున్నాను అని ఆకాశ్ పూరి తెలిపారు.

ప్రభాస్ సపోర్ట్ అమేజింగ్
రొమాంటిక్ సినిమాకు ప్రభాస్ ఇచ్చిన సపోర్ట్ అమేజింగ్. చిన్నప్పటి నుంచి నేను ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాను. ఆయన అంటే నాకు ఇష్టం. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. మేము మా సినిమాను ప్రమోట్ చేయమని అడుగలేదు. ఆయనే స్వయంగా మా సినిమాను ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చారు. మమ్మల్ని ముంబైకి పిలిచి బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి ఒక రోజంతా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని ఆకాశ్ పూరి తెలిపారు.

నాన్నకు తిరిగి ఇవ్వాలని అనుకొంటున్నా
నాన్న నుంచి నేను చాలా స్పూర్తి పొందుతాను. ఎలాంటి పరిస్థితుల్లోనే మానసికంగా ధృడంగా ఉంటారు. సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. నాన్న దర్శకత్వం వహించిన చిత్రాల్లో మూడు సినిమాలు నాకు ఇష్టం. పోకిరి, నేనింతే, బిజినెస్ మ్యాన్ అంటే ఇష్టం. చోర్ బజార్ సినిమా బాగా వస్తున్నది. మంచి యాక్షన్, ఎంటర్‌టైనర్ అవుతుంది. నాకు కొత్తరకమైన కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని అనుకొంటున్నాను. మాస్ ఆడియెన్స్ నుంచి క్లాస్ ఆడియెన్స్ మెప్పించేలా సినిమాలు చేయాలని ఉంది అని ఆకాశ్ పూరి అన్నారు.
Recommended Video

భవిష్యత్‌లో డైరెక్షన్ చేస్తా
నాన్న పూరి జగన్నాథ్ స్పూర్తితో భవిష్యత్‌లో దర్శకుడిగా మారుతాను. నాకు రైటింగ్ రాదు. నాన్న రాసిన కథను డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఆ కథను డైరెక్ట్ చేస్తున్నాను. నాకు సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, చిరంజీవి అంటే చాలా ఇష్టం. రజనీ, చిరంజీవి దేవుళ్లతో సమానం అంటూ ఆకాశ్ పూరి అన్నారు.


Click it and Unblock the Notifications











