Salman Khan విషయంలో కన్నింగ్ గేమ్ ఆడా.. గాడ్‌ఫాదర్‌లో మెగా హీరోలు కాకుండా.. మోహన్ రాజా
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. లూసిఫర్ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. లూసిఫర్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ చేసిన పాత్రను సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటింపజేయడం వెనుక కథను దర్శకుడు మోహన్ రాజా షేర్ చేసుకొంటూ..
గాడ్‌ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్‌ను తీసుకు రావడానికి నేను ఒక కన్నింగ్ గేమ్ ఆడాను. ఈ కథలో అందరూ గేమ్ ఆడుతారు. కానీ హీరో ఆడే గేమ్‌లో వీళ్లందరూ పాత్రధారులు. చిరంజీవి పాత్ర సర్వంతర్యామి అనే ఫీలింగ్ నాకు కలిగింది. సల్మాన్ ఖాన్ పాత్ర చుట్టు కథ తిరుగుతుంది. కానీ ఆయన కనిపించరు. అలాంటి పాత్ర కోసం మెగా ఫ్యామిలీలోని హీరోలను పెట్టవచ్చు. కానీ అంతకంటే గొప్ప సర్‌ప్రైజ్ ఉండాలని నేను ఆలోచించాను. మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే హీరో ఎవరా? ఆలోచిస్తే.. సల్మాన్ ఖాన్ తట్టాడు. అప్పుడు నేను ఓ కన్నింగ్ గేమ్.. ఆడి సల్మాన్ ఖాన్ కావాలని అడిగాను.

నేను సల్మాన్ ఖాన్ అయితే బాగుంటాడని చెప్పగానే.. వెంటనే ఆయనకు కాల్ చేశారు. రాంచరణ్ గాడ్‌ఫాదర్‌లో రోల్ గురించి చెప్పగానే.. వెంటనే ఒప్పేసుకొన్నారు. ఇదంతా 20 నిమిషాల్లో జరిగిపోయింది. అయితే చిరంజీవికి ఇంకా ఏదో అనుమానం ఉంటే.. మళ్లీ కాల్ చేసి.. మీరు ఆ పాత్రను చేస్తారా అంటే.. వెంటనే సల్మాన్.. అది విలన్ పాత్రనా అనే అనుమాన పడ్డారు. అయితే విలన్ పాత్ర కాదని చెప్పడంతో సినిమా చేయడానికి అభ్యంతరం లేదని అన్నారు. అలా సల్మాన్ ఖాన్ గాడ్‌ఫాదర్ సినిమాలోకి వచ్చారు. లూసిఫర్ సినిమా చూడకుండా గాడ్‌ఫాదర్‌లో చేయడానికి ఒప్పుకొన్నారు. ఆ తర్వాత నేను ముంబైకి వెళ్లి.. ఆయన నటించే సీన్లను చూపించి.. కొంత నేరేషన్ ఇచ్చాను అని మోహన్ రాజా చెప్పారు.
గాడ్‌ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర చిన్నదైనా.. చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చిరంజీవి, సల్మాన్ ఇద్దరికి మంచి పాట పెట్టాం. ఇప్పటికే ఆ పాట వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











