GodFather ఆ ఆకలిని తీర్చుతుంది.. చిరంజీవి లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదు.. మోహన్ రాజా (ఇంటర్వ్యూ)
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై రాంచరణ్, ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళంలో విజయ సాధించిన లూసిఫర్‌కు రీమేక్. చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరీ జగన్నాథ్, సత్యదేవ్, అనసూయ, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 5న రీలీజ్ అవుతున్న నేపథ్యంలో డైరెక్టర్ మోహన్ రాజా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ...

లూసిఫర్‌ను 100 సార్లు చూశా
లూసిఫర్ సినిమాకు నేను పెద్ద అభిమానిని. నాకంటే ఆ సినిమాను ఎవరూ ప్రేమించలేరు. అలా నేను ప్రేమించిన సినిమాను చెడగొట్టలేను కదా.. లూసిఫర్‌ను 100 సార్లు చూశానంటే తక్కువే. ఈ సినిమాలో నటీనటులు పెద్ద సర్‌ప్రైజ్. ఈ సినిమాలో సత్యదేవ్ విలన్‌గా ఆశ్చర్యం కలిగిస్తాడు. సత్యదేవ్‌కు మంచి పేరు వస్తుంది. చిరంజీవి తర్వాత పేరొచ్చేది ఎవరైనా ఉంటే.. అది సత్యదేవ్ అని మోహన్ రాజా వెల్లడించారు. స్క్రీన్ ప్లే బాగా ఉండటానికి సత్యదేవ్ పోషించిన విలన్ క్యారెక్టర్ కారణం. ఆ పాత్ర అందర్నీ ఆకట్టుకొంటున్నది అని మోహన్ రాజా అన్నారు.

2 గంటలపాటు చిరంజీవి చుట్టే..
ఏ సినిమా కథకైనా హీరో ఇమేజ్ ప్రధాన కారణం. అలాంటి ఇమేజ్ చిరంజీవి గారికి ఉంది. కథను ఆయన ఇమేజ్ ముందుకు తీసుకెళ్తుంది. 2.39 గంటల సినిమాలో 2 గంటల నిడివిలో చిరంజీవి ఉంటారు. లూసిఫర్ సినిమా స్లోగా ఉందనేది నిజం. కానీ నేను రాసిన స్క్రీన్ ప్లేలో కథ చాలా ఫాస్ట్‌గా ముందుకు వెళ్తుంది. పృథ్వీరాజ్ అనుసరించిన స్క్రీన్ ప్లే డిఫరెంట్ ఉంది అని మోహన్ రాజా చెప్పారు.

చిరంజీవిలో గొప్పతనం అదే..
ఎక్కువగా నేను నా తమ్ముడితో సినిమాలు చేశాను. చిరంజీవిని డైరెక్ట్ చేయడం గొప్ప అనుభూతి. నా కెరీర్‌లో చిరంజీవి లాంటి నటుడిని చూడలేదు. ఆయన ఎన్నో హిట్లు, ఎంతో కీర్తి సాధించాడు. సల్మాన్ ఖాన్‌పై సీన్లను షూట్ చేస్తుంటే.. ఆయన ఉండాలంటే.. కార్‌వాన్‌లో ఉండొచ్చు. కానీ సెట్లోనే ఉండి.. అవసరమైతే నేను రెడీగా ఉంటానని చెప్పాడు. అలాంటి డెడికేషన్ ఉన్న నటుడు చిరంజీవి. ఎదుటి వ్యక్తికి ఎలా గౌరవం ఇస్తారనేది ఇదో ఉదాహరణ అని మోహన్ రాజా చెప్పారు.

పూరీని తీసుకోవాలనే ఐడియా
గాడ్‌ఫాదర్ సినిమాలో పూరీ జగన్నాథ్ జర్నలిస్టుగా నటించారు. ఈ సినిమాలో పూరీని తీసుకోవాలనే ఐడియా చిరంజీవి. పూరీ చేసిన ప్రాడ్‌కాస్ట్ విని.. ఆయన చేత డైలాగ్స్ చెప్పిస్తే బాగుంటుదని చిరంజీవి అనుకొన్నారు. పూరీ, చిరంజీవి మధ్య ఓ పవర్‌ఫుల్ సీన్ ఉంది. ఆయన చేత చెప్పించిన డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకొంటాయి. పూరీ జగన్నాథ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసిన అమ్మా, నాన్న, తమిళ అమ్మాయి సినిమాను నేను రీమేక్ చేశాను.

అలాంటి స్క్రీన్ ప్లే మ్యాజిక్
ఒక మంచి సినిమా చూడాలనే ఆకలిని గాడ్‌ఫాదర్ తీర్చుతుంది. ప్రేక్షకులు కథ గురించి.. ఆడటం లేదు. కథను ఎలా చెబుతున్నారనే ఆలోచిస్తున్నారు. గాడ్‌ఫాదర్ సినిమా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తుందనే నమ్మకం ఉంది అని మోహన్ రాజా అన్నారు. ఒక సినిమాలో చిరంజీవి నటిస్తే.. పదిమంది నటించినంతగా ఉంటుంది. ఈ సినిమాలో చిరంజీవి గెలుస్తాడు. మరో పది క్యారెక్టర్లను గెలిపిస్తాడు. గాడ్‌ఫాదర్ సినిమాను మళ్లీ మలయాళంలో రిలీజ్ చేయడానికి కారణం. కథలో ఒక కీ పాయింట్‌ను మార్చాం. అదే ఈ సినిమాకు ప్రాణం అని మోహన్ రాజా తెలిపారు.


Click it and Unblock the Notifications











