ఆ ఇద్దరు డైరెక్టర్లు డైమండ్స్.. ఫ్లాప్స్‌తో విలువ తగ్గుతుందా? రామ్ పోతినేని (ఇంటర్వ్యూ)
ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల ఘన విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన చిత్రం ది వారియర్. దక్షిణాదిలో స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. యూ టర్న్, సీటిమార్ చిత్రాలను అందించిన ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 6గా రూపొందిన ఈ చిత్రం జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ పోతినేని మీడియాతో మాట్లాడుతూ..

పోలీస్ కథ చేద్దామని అనుకొన్న సమయంలో
పోలీస్ కథ చేద్దామని అనుకొన్నాను. అయితే చాలా కథలు విన్నాను. అవన్నీ రొటీన్ కథలు అనిపించాయి. అందుకే పోలీస్ కథతో సినిమా చేయాలనే ఆలోచనను పక్కన పెట్టాను. అయితే దర్శకుడు లింగు స్వామి కథ చెప్పడానికి వస్తానంటే సరేనన్నాను. తీరా నా వద్దకు వచ్చి కథ చెప్పడానికి ముందు ఇది పోలీస్ స్టోరి అన్నాడు. అయితే పోలీస్ కథ చేయవద్దని అనుకొన్నానే.. కథ విన్న తర్వాత వేరే స్టోరితో సినిమా చేద్దామని అనుకొన్నాను. ఫార్మాలిటీ కోసం కథ విన్నాను. ఒక్కసారి కథ చెప్పిన తర్వాత కథలో ఉండే బలమైన పాయింట్ నన్ను బాగా కదిలించింది. అప్పుడే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను అని రామ్ పోతినేని తెలిపారు.

జెన్యూన్ ఎమోషన్స్‌తో మూవీ
పోలీస్ కథ అంటే.. ఆఫీసర్.. విలన్ అనే పాయింట్ ఉంటుంది. అయితే ఈ కథలో ఒక ఎమోషన్ నన్ను బాగా కనెక్ట్ చేసింది. నాకు ఆయన చెప్పిన కథ కనెక్ట్ అయింది. నేను ఆయనకు బాగా కనెక్ట్ అయ్యాను. కథ విన్న వెంటనే ఈ ఆలోచన ఎలా తట్టింది అని అడిగాను. అయితే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథ పుట్టింది. కొందరు ఆఫీసర్లు ఉన్నారు. ఇందులో జెన్యూన్ ఎమోషన్ ఉంది. కథ విన్న తర్వాత వెంటనే సాయంత్రానికి కల్లా పోలీస్ డ్రస్ తెప్పించి వేసుకొన్నాను. ఆ డ్రెస్ వేసుకొన్నప్పుడే ఆ పవర్ ఏంటో నాకు తెలిసింది అని రామ్ అన్నారు.

ఆది పినిశెట్టిపై అలాంటి డౌట్
లింగుస్వామి కథ చెప్పినప్పుడు గురు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సినిమాలో గురు క్యారెక్టర్ చాలా కీలకం. ఆ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందనే టెన్షన్ పడ్డాను. అయితే గురు పాత్రను ఆది పినిశెట్టి పేరు చెప్పగానే నేను రిలాక్స్ అయ్యాను. కానీ ఆది ఈ పాత్ర చేస్తారా అనే డౌట్ ఉండేది. ఒకసారి ఆది కథ విన్న తర్వాత ఆ పాత్రను చేయడానికి ఒప్పుకోవడం, వెంటనే ఆ క్యారెక్టర్ కోసం సిద్దమయ్యారు అని రామ్ తెలిపారు.

వారియర్ అని టైటిల్ ఎందుకు పెట్టామంటే?
ఇస్మార్ట్ శంకర్ కంటే ముందు నా ఆలోచన విధానం మారింది. అందుకే నేను ఆ సినిమా చేశాను. ప్రేక్షకుల ఆదరిస్తున్నందున ఇక నుంచి మాస్ సినిమాలే చేయాలని డిసైడ్ అయ్యాను అని రామ్ పోతినేని చెప్పారు. ఇక కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే పదం బాగా నచ్చింది. ఎవరూ బయటకు రాకుండా ఇళ్లల్లో ఉన్నప్పుడు డాక్టర్లు, పోలీసులు బయటకు వచ్చారు. అందుకని, వారియర్ టైటిల్ పెట్టాం అని రామ్ తెలిపారు.

పూరీ, లింగుస్వామి డైమండ్స్
ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు పూరీ జగన్నాథ్‌కు హిట్లు లేవన్నది నిజం. అలాగే ది వారియర్ మూవీకి ముందు కూడా లింగుస్వామికి హిట్స్ లేవు. కానీ నేను అలాంటి లెక్కలు వేసుకోలేదు. పూరీ, లింగుస్వామి ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్స్. వాళ్లిద్దరి బ్రిల్లియెన్స్‌ను తప్పుపట్టడం సరికాదు. మంచి కథ పడితే రిజల్ట్ వేరేలా ఉంటుంది. పూరీ, లింగుస్వామి డైమండ్స్ లాంటి వారు. ఫ్లాప్స్ రావడం డైమండ్‌పై దుమ్ముపడటం లాంటింది. దాన్ని తుడిచి వేస్తే డైమండ్ విలువ అలానే ఉంటుంది అని రామ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











