పూరీ జగన్నాథ్ డైరెక్షన్ కి మైండ్ బ్లాక్.. ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయిన విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తాజాగా నటించిన చిత్రం సార్ మేడమ్. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ సేతుపతి స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రం గురించి మాట్లాడారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
విజయ్ సేతుపతి x పూరీ జగన్నాథ్..
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ ప్రస్తుతం కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. గత చిత్రాలతో దెబ్బ మీద దెబ్బ పడటంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత శ్రద్ధ వహించారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కొలాబరేట్ అయ్యారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు, స్టార్ కాస్ట్ విజయ్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ ల జేబీ నారాయణ రావు నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ కూడా నిర్మాణ భాగస్వామ్యం పంచుకుంది. ఈ చిత్ర షూటింగ్ జూలై మొదటి వారం నుంచి ప్రారంభం కావడం విశేషం.

పూరీపై విజయ్ సేతుపతి కామెంట్స్..
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సార్ మేడమ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తుండటం గొప్ప ఫీలింగ్ అని చెప్పారు. ఆయనొక లెజెండ్, చాలా మృదుస్వబావి అని చెప్పారు. ప్రతి రోజు షూటింగ్ కు వెళ్లి ఆయనతో పని చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక పూరీ జగన్నాథ్ రాసిన డైలాగ్స్, ఆయన కథను నడిపించే తీరు, ఆయన టైమింగ్ ఆకట్టుకుంటూ ఉంటుంది. తప్పకుండా మంచి సినిమాను బయటికి తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు.
150 కోట్ల భారం?
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చివరిగా విజయ్ దేవరకొండతో లైగర్ : సాలా క్రాస్ బ్రీడ్, రామ్ పోతినేతితో డబుల్ ఇస్మార్ట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ రెండు చిత్రాలు పూరీ జగన్నాథ్ కు బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాన్ని మిగుల్చాయి. ఈ రెండు సినిమాలతో కలిసి పూరీకి ఏకంగా రూ.150 కోట్ల వరకు ఆర్థిక భారం పడిందని ట్రేడ్ వర్గాల టాక్.
పూరీ, సేతుపతి సినిమా టైటిల్..
విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ రూపొందించబోతున్న చిత్రానికి బెగ్గర్ అనే చిత్రాన్ని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. మరోమైపు సినిమా చాలా స్టైలిష్ గా ఉంటుందని, ఆత్రుతను కలిగించేలా ఉండబోతుందని, చాలా కొత్తగా తెరపైకి రాబోతున్నారని తెలుస్తోంది. దీంతో టైటిల్ కూడా స్టైలిష్ గానే ఉంటుందని పలువురి అభిప్రాయం. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











