Puneeth : 'అప్పు'ని గ్రాండ్ గా లాంచ్ చేసిన పూరి జగన్నాధ్.. పూరీ లైఫ్ నే మార్చేసిన పునీత్!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అనూహ్యంగా గుండె పోటుతో మృతి చెందడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు రావడంతో కుప్పకూలి పోయాడు. దీంతో ఆయనను ముందుగా ఒక హాస్పిటల్ కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మరో హాస్పిటల్ కి తరలించారు. కానీ ఆయన ప్రాణాలు మాత్రం నిలవలేదు. అయితే ఆయన మొదటి సినిమా అప్పు తెరకెక్కించింది పూరిజగన్నాథ్ కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే

పూరితో మొదటి సినిమా

పూరితో మొదటి సినిమా

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చిన పునీత్ అందంగా లేకున్నా తన నటన, డ్యాన్స్, ఫైట్స్‌తో ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకుని ప్రస్తుతం కన్నడలో టాప్ స్టార్లలో ఒకరిగా దూసుకు పోతున్నాడు. ఇంత స్టార్‌డం సంపాదించుకున్న పునీత్ రాజ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేసింది మన తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

ఆ సినిమా చేయడంతో

ఆ సినిమా చేయడంతో

2002లో 'అప్పు' అనే సినిమాతో పునీత్ రాజ్‌ కుమార్‌ను పూరి జగన్నాథ్ హీరోగా పరిచయం చేశాడు. అంతకుముందు బాలనటుడిగా పునీత్ ఎన్నో సినిమాలు చేసినా.. మొదటి సినిమాతోనే పునీత్ ను పూరి స్టార్‌ను చేసి నిలబెట్టాడు. ఈ సినిమానే తెలుగులో రవితేజతో 'ఇడియట్' పేరుతో రీమేక్ చేయగా.. ఈ సినిమా మాస్ మహరాజ్ కెరీర్‌ను కూడా మలుపు తిప్పింది. నిజానికి పూరి జగన్నాథ్ పునీత్ రాజకుమార్ కి లైఫ్ ఇచ్చాడు అని అనుకుంటారు కానీ, ఒకరకంగా పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ గా మారడానికి కారణం కూడా పునీత్ అంటున్నారు విశ్లేషకులు.

ఒకరికి ఒకరు అండగా

ఒకరికి ఒకరు అండగా


ఎలా అంటే పూరి జగన్నాథ్ చేసిన బద్రి సినిమాకి ఫుల్ క్రెడిట్ పవన్ కళ్యాణ్ కే వెళ్లి పోయింది. బాచి సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ గ్యాప్ లోనే అప్పు అనే సూపర్ హిట్ సినిమాను కన్నడలో తీసాడు. ఆ సక్సెస్ తోనే ఇడియట్ అనే సినిమాను అదే కథగా తీసి మరో హిట్ కొట్టాడు. అలా సో... ఈ రోజు పూరీ స్థాయికి ముఖ్య కారణం పునీత్ అంటున్నారు. నిజానికి అంతకుముందు 2001లో పునీత్ రాజ్‌కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్‌తో తెలుగు తమ్ముడు సినిమాని యువరాజాగా రీమేక్ చేసి పూరి హిట్ కొట్టాడు. దీంతో రాజ్‌కుమార్ పిలిచి మరీ పునీత్‌ను లాంచ్ చేసే అవకాశం పూరి చేతిలో పెట్టారు.

 స్టార్ హీరోలతో సత్సంబంధాలు

స్టార్ హీరోలతో సత్సంబంధాలు


ఆ తరువాత ఈ సినిమా ఎన్నో భాషల్లో అధికారికంగా రీమేక్ అయిందనుకొండి అది వేరే విషయం. తెలుగులో రవితేజ హీరోగా ఇడియట్ పేరుతో, తమిళంలో శింబు హీరోగా దమ్ పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. బెంగాలీ, బంగ్లాదేశీ భాషల్లోకి కూడా ఈ సినిమా రీమేక్ అయిందంటే ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత పునీత్ రాజ్‌కుమార్ కెరీర్ పరుగులు పెట్టింది. ఆ తరువాత కూడా ఎన్నో తెలుగు సూపర్ హిట్ సినిమాలను పునీత్ కన్నడలో రీమేక్ చేశారు. రాజ్ కుమార్ కుమారుడిగా పునీత్ కు ఇతర భాషల స్టార్ హీరోలతో సత్సంబంధాలు ఉన్నాయి.

Recommended Video

Akash Puri 'Romantic' Movie Team Interview
స్పందించిన పూరీ

స్పందించిన పూరీ

పునీత్ మరణం గురించి పూరి జగన్నాథ్ తాజాగా స్పందించారు. తాను చేసిన అప్పు సినిమాతోనే పునీత్ రాజ్ కుమార్ హీరోగా లాంచ్ అయ్యాడు అని వెల్లడించిన పూరి తామిద్దరం త్వరలోనే కలుద్దామని అనుకున్నాము అని కానీ కలవకుండానే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అని బాధపడ్డారు. పునీత్ స్వతహాగా చాలా గొప్ప వ్యక్తి అని అలాంటి వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని పూరిజగన్నాథ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X