X
అవతార్: ద వే ఆఫ్ వాటర్
Adventure | 16 Dec 2022 | U/A | 192 Mins
Telugu

అవతార్: ద వే ఆఫ్ వాటర్ స్టోరీ

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా యాక్షన్, ఫాంటసీ, అడ్వెంచర్ ఎంటర్‌టైనర్‌.  విసామ్ వార్తింగ్టన్, జో సల్దానా, స్టెఫాన్ ల్యాంగ్, జోయల్ డేవిడ్ మోర్, దిలీప్ రావు తదితరులు నటించారు.  రచన, నిర్మాత, దర్శకత్వం: జేమ్స్ కామెరాన్. బ్యానర్: లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్, డ్యూన్ ఎంటర్‌టైన్‌మెంట్. సినిమాటోగ్రాఫర్: మారో ఫియోర్

కథ

యూఎస్ ఆర్మీలో పనిచేసే జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్) నావీగా మారడం, తిరుగుబాటు చేయడాన్ని సహించలేని అధికారులు.. పండోరా గ్రహంలోని నావీ తెగపై ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటారు. ఆర్మీ నుంచి తప్పించుకోవడానికి అటవీ ప్రాంతం నుంచి సముద్రంలోకి నావీ తెగ సభ్యులు మకాం మారుస్తారు. సముద్ర జలాల్లో ఉన్న జేక్ సల్లీ, నేత్రీ (జో సల్దానా) ఫ్యామిలీని, నావీ తెగను టార్గెట్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్‌లో భాగంగా జేక్ సల్లీ పిల్లలను కిడ్నాప్ చేస్తారు. నావీ తెగపై దాడి చేయాలనుకొన్న ఆర్మీపై జేక్ సల్లీ వర్గం ఎలా ఎదురు దాడి చేసింది? ఆర్మీ అధికారి కుట్రలను ఎలా జేక్, నేత్రి తిప్పికొట్టారు. కిడ్నాప్‌ గురై ఆర్మీ చెరలో ఉన్న పిల్లలను ఎలా రక్షించుకొన్నారు? ఆర్మీ దాడిలో ప్రాణాలు కోల్పోయిన తన కొడుకు నేతేయం (జామీ ఫ్లాటర్) మరణానికి జేక్, నేత్రీ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నారు. ఆర్మీ అధికారి పెంపుడు కొడుకు స్పైడర్ (జాక్ ఛాంపియన్) జేక్, నేత్రికి ఎలా సహకారం అందించాడు? నావీ తెగ చేసే వనవాసంలో ఎలాంటి సమస్యలు జేక్ సల్లీ ఎదుర్కొన్నాడు? పండోరా గ్రహాన్ని ఆక్రమించి నావీ తెగను నాశనం చేయాలనే కుట్రను జేక్ సల్లీ ఎలా అడ్డుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే అవతార్ 2 (Avatar: The Way of Water) సినిమా కథ.

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+