X
చుట్టాలబ్బాయి
Action | Romance | 19 Aug 2016 | 122 Mins
Telugu

చుట్టాలబ్బాయి స్టోరీ

చుట్టాలబ్బాయి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, నమిత ప్రమోద్, సాయికుమార్, అభిమన్యు సింగ్, వంశీ కృష్ణా, పోసాని కృష్ణ మురళి, అలీ, పృద్వి, శకలక శంకర్, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరబద్రం నిర్వహించారు మరియు నిర్మాత వెంకట్ తలారి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ ఎస్ స్వరాలు సమకుర్చరు. 


కథ


రికవరీ ఏజెంట్ బాబ్జీ(ఆది) అనుకోకండా ఏసీపీ కమ్‌ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు (అభిమన్యుసింగ్‌) కి విరోధమవుతాడు. అందుకు కారణం బాబ్జీ తన చెల్లెలు కావ్య (నమిత ప్రమోద్‌) కు లైన్ వేస్తున్నాడేమో అనే డౌట్. కావ్య ఓసారి బాబ్జీతో చనువుగా ఉండడం చూసి బాబ్జీకి వార్నింగ్‌ ఇస్తాడు ఏసీపీ. నిజానికి కావ్య.. బాబ్జీల మధ్య చిన్న ప్రెడ్షిప్ కూడా ఉండదు. తమది ప్రేమ కాదని ఏసీపికు చెప్పి క్లారిటీ ఇచ్చే సమయానికి ఇంటి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది కావ్య...కావ్య ఇంటిలో నుంచి పారిపోవటానికి కారణం...ఆమెకు ఇష్టం లేకుండా తన అన్న పెళ్లి ఫిక్స్ చేయటమే. అయితే కో ఇన్సిడెంటల్ గా అక్కడికి వచ్చిన బాబ్జీ అక్కడికి వచ్చి ఆమెను కనిపిస్తాడు.దాంతో 'వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని పారిపోతున్నార'ని ఫిక్సయిపోతారు మన ఎసిపీ. అక్కడ్నుంచి బాబ్జీ.. కావ్యల వెంటపడతారు పోలీసులు. వాళ్లని తప్పించుకొనే ప్రయత్నంలో ఉండగానే మరో గ్యాంగ్ కూడా కావ్య కోసం వెదుకుతూ ఎదురవుతుంది. ఇదిలా ఉంటే దొరబాబు (సాయికుమార్‌) మనుషులు బాబ్జీ.. కావ్యలను కిడ్నాప్‌ చేసేస్తారు. మధ్యలో ఈ దొరబాబు ఎవరు? ఆమె వెనక పడుతున్న ఆ గ్యాంగ్ ఎవరు...హీరో ఏం చేసాడు..అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+