X
దమ్ము
Action | Romance | 27 Apr 2012 | A |
Telugu

దమ్ము స్టోరీ

దమ్ము సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్టీఆర్‌, త్రిష, కార్తీక, వేణు, కోట శ్రీనివాసరావు, సుమన్‌, నాజర్‌, కిశోర్‌, సంపత్‌, శ్రీధర్‌రెడ్డి, చలపతిరావు, భానుప్రియ, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్‌, అలీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను నిర్వహించారు మరియు నిర్మాత కె ఎ వల్లభ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కీరవాణి స్వరాలు సమకుర్చారు.

కథ

తనకి సంభందం లేని వారు ప్రమాదంలో ఉంటే వారి కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడే అనాధ రామచంద్ర(ఎన్టీఆర్). సిటీలో చిన్న చిన్న ఫైట్ లు చేసుకుంటూ అప్పుడప్పుడూ త్రిష (సత్య)అనే కోటీశ్వరాలు ప్రేమలో పడి తిరుగుతూ హ్యాపీగా లైఫ్ గడిపేస్తూంటాడు. అయితే సత్య తండ్రి అనాధకు తన కూతురుని ఇచ్చి చేయడని తెలియటంతో తప్పనిసరి పరిస్తితుల్లో ... వాసిరెడ్డి వంశీకులైన ఓ పెద్ద జమీందార్(కోట శ్రీనివాసరావు) కుటుంబానికి వారసుడుగా దత్తతకు వెళతాడు. అయితే ఆ వారసత్వం లభించాలంటే అనాధ అనే నిజం దాచి పెట్టి పాతికేళ్ల తర్వాత ఆ వంశానికి వస్తున్న నిజమైన వారసుడు అని చెప్పాలంటారు. అలాగే అని ఆ పల్లెకు వెళ్లి ఆ కుటుంబంలో ప్రవేశిస్తాడు.

చక్కగా ఆ కుటుంబాన్ని చూపించి పెళ్లి చేసుకుని వెళ్లిపోదామనుకున్న అతనికి అక్కడో ట్విస్టు ఎదురవుతుంది. ఆ కుటుంబానికి కొన్ని తరాలుగా రగులుతున్న పగ ఉందని తెలుస్తుంది. అవతలి వాళ్లు పగే ప్రాణంగా బ్రతుకుతున్నారని,అందుకోసం ప్రాణాలు సైతం తీయటానికి వెనకాడరని తెలుస్తుంది. అంతేగాక ఆ ఇంటి వారసుడుగా వెళ్లినందుకు ఆ పగకోసం అతను సైతం పోరాటానికి బయిలుదేరాల్సి వస్తుంది. ఈ మధ్యలో అక్కడ అతనికో మరదలు నీలవేణి (కార్తీక) పరిచయ్యి అతనిపైనే ఆశలు అన్ని పెట్టుకుంటుంది. ఆ సమయంలో రామచంద్ర ఏం చేసాడు...అప్పటికే ఆ ఇంటితో అల్లుకున్న అనుబంధం కోసం పోరాడాడా లేక... పలాయినం చిత్తగించాడా అన్నది తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+