X
ఈ నగరానికి ఏమైంది
Action | Romance | 29 Jun 2018 | U/A |
Telugu

ఈ నగరానికి ఏమైంది స్టోరీ

ఈ నగరానికి ఏమైంది సినిమా డ్రామా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వక్, అనీషా ఆంబ్రోస్, సాయి సుశాంత్, అభినవ్ గోమతమ్, వెంకటేష్ కకుమణు, సిమ్రాన్ చౌదరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తరుణ్ భాస్కర్ వహించారు మరియు నిర్మాత సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ అందించారు. 

కథ

వివేక్, కార్తీక్, ఉపేంద్ర, కౌశిక్ (విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను) బాల్య స్నేహితులు. షార్ట్ ఫిలిం తీయడం ద్వారా నిర్మాతలను ఆకర్షించి బిగ్ మూవీస్ రూపొందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో వివేక్ (విశ్వక్ సేన్)కు శిల్ప (సిమ్రాన్ చౌదరీ)తో బ్రేకప్ జరుగుతుంది. ఆ తర్వాత ఓ రకమైన అభద్రతాభావంలో వివేక్ మునిగిపోతాడు. యాటిట్యూడ్ పెరిగిపోతుంది. దాంతో వారు షార్ట్ ఫిలింస్ తీయడం ఆపేసి ఏదో పనిచేస్తూ జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంటారు. ఆ సమయంలో ఓ సమస్యలో ఇరుక్కుపోవడంతో కార్తీక్ ఐదు లక్షలు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో నలుగురు ఫ్రెండ్స్ మళ్లీ షార్ట్ ఫిలిం తీసి కార్తీక్‌ను ఆదుకోవాలని నిశ్చయించుకొంటారు.

కార్తీక్ వచ్చిన సమస్య ఏమిటి? వివేక్ షార్ట్ ఫిలిం తీసి దర్శకుడిగా సక్సెస్ అవుతాడా? కౌశిక్ (అభినవ్ గోమటం) నటుడిగా స్థిరపడ్డారా? కార్తీక్ సినిమాటోగ్రఫర్‌గా సక్సెస్ అయ్యాడా? ఉపేంద్ర ఎడిటర్‌గా స్థిరపడ్డారా? వివేక్ లవ్ ఎందుకు బ్రేకప్ అయింది? షార్ట్ ఫిలిం తీసే క్రమంలో పరిచయమైన షెర్లీను ప్రేమను వివేక్ పొందాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ నగరానికి ఏమైంది చిత్ర కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+