X
ఝుమ్మంది నాదం
Romance | 01 Jul 2010 | U |
Telugu

ఝుమ్మంది నాదం స్టోరీ

ఝుమ్మంది నాదం సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్‌ కుమార్‌, తాప్సీ, మోహన్‌ బాబు, సుమన్‌, తనికెళ్లభరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు, అలీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత మంచు లక్షీ ప్రసన్న నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.

కథ

కెరీర్ ముఖ్యమా...ప్రేమ ముఖ్యమా (రెండూ కావలంటే కుదరదు) అనే పాయింట్ చుట్టూ అల్లిన కథ ఇది. తన ఊరు భద్రాచంలో ఛాలెంజ్ చేసి హైదరాబాద్ బయిలుదేరిన ఔత్సాహిక గాయకుడు బాలు(మనోజ్). అయితే ఎక్కడా మచ్చుకైనా ఆ దిసలో అతను చేస్తున్న ట్రైల్స్ కనపడవు..అది వేరే సంగతి. అక్కడ అతని ఎదురింట్లోకి ఓ ఎన్నారై అమ్మాయి శ్రావ్య (తాప్సీ) దిగుతుంది. ఆమె ఆశయం..తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిలపై డాక్యుమెంటరీ చేయాలని. అలాగని ఆమె తెలుగువారి సంస్కృతి, సంప్రదాయలని గౌరవించి పాటిస్తుందని ఫిక్సవకండి. ఎప్పుడూ పై నించి క్రిందదాకా ఎక్సపోజ్ చేసే డ్రస్స్ ల్లో తిరుగుతూంటుంది. ఇక ఆమెకు గార్డియన్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ కెప్టెన్ రావ్(మోహన్ బాబు). ఆయన బాలు ఉన్న ఇంటి ఎదురుగానే ఉంటూంటాడు. మరో ప్రక్క కెప్టెన్ రావ్ కి యంగ్ జనరేషన్ అంటే గిట్టదు..ముఖ్యంగా బాలు అంటే అస్సలు గిట్టదు. ఇక బాలు, శావ్య పరిచయాలు సినిమాటెక్ గా జరిగాక ఆమె చేసే డాక్యుమెంటరీకి మ్యూజిక్ గైడ్ గా బాలు చేరతాడు. అంతేగాక ఆమె అందాలను దగ్గరనుంచి చూసి ప్రేమలో పడతాడు. ప్రేమ ముదిరి పాకాన పడుతుందనగా...బాలుకి జెమినీ మ్యూజిక్ ఛానెల్ కాంపిటేషన్ లో పాల్గొనే ఆఫర్ వస్తుంది. అయితే ఆ పోగ్రామ్ లో పాల్గొనాలంటే ఈ ప్రేమ విషయం తెలిసిన కెప్టెన్ రావు అడ్డుపడతాడు. నీకు ప్రేమ కావాలా లేక కష్టపడి సాధించాలనుకున్న కెరీర్ కావాలా అని పుల్లేస్తాడు. కెరీర్ కావాలన్న బాలుతో శ్రావ్యని వదిలేయానే కంఢీషన్ పెడతాడు. అప్పుడు బాలు ఏం నిర్ణయం తీసుకున్నాడు. కెరీర్, ప్రేమ రెండింటిని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+