జోష్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, కార్తిక, ప్రకాష్ రాజ్, జెడి చక్రవర్తి, సునీల్, బ్రహ్మానందం, ఆనంద్, సితార, హేమ, సూర్య తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వాసు వర్మ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సందీప్ చౌతా స్వరాలు సమకుర్చారు.
కథ
కథ విషయానికొస్తే సత్య(నాగచైతన్య) వైజాగ్ లో డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు. ఓ రోజు తన తల్లితండ్రులతో కాలేజీ మానేస్తున్నానని చెప్పి, ఉద్యోగం కోసం హైదరాబాదు వస్తాడు. తన మామయ్య (సునీల్) తో కలసి వుంటూ ఓ నర్సరీలో ఉద్యోగం చేస్తూ వుంటాడు. అనుకోకుండా విధ్య(కార్తిక) అనే స్కూల్ టీచర్ ను కలుస్తాడు. విధ్య ఎప్పుడూ కాలేజీకి వెళ్లాలని కలలుకంటూ వుంటుంది. కానీ తనని కాలేజీకి పంపడం ఆమె అన్నయ్యకు ఇష్టం వుండదు. కాలేజీకి వెళ్తే తన చెల్లెలు భద్రంగా వుండదని అతని అభిప్రాయం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది.
ఇదిలా వుంటే ఓ సారి సత్య యంజియం కళాశాల విధ్యార్థులతో గొడవపడతాడు. కానీ ఆ విధ్యార్థులకు జెడి(జెడి చక్రవర్తి) అనే రాజకీయనాయకుడి అండదండలు మెండుగా వుంటాయి. జెడి విధ్యార్థులని తన అవసరాలకు ఉపయోగించుకుంటూ వుంటాడు. దీంతో ఆ విధ్యర్థులను మార్చాలనుకున్న సత్య వారి కాలేజీలోనే చేరతాడు. ఇక మిగిలిన కథ సత్య ఎలా ఆ విధ్యార్థులను జెడి మాయ నుండీ బయటకు తీసుకొచ్చి, జెడి ఆట కట్టించాడు అనేది.